తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సింగరేణి గని పైకప్పు కూలి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. శ్రీరాంపూర్ సింగరేణి ఎస్ఆర్పీ-3 గనిలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పైకప్పు కూలి విధులు నిర్వర్తిస్తున్న కార్మికులపై పడింది. మొదటి షిఫ్టు లోభాగంగా మైన్ లో బొగ్గు వెలికి తీస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.
మైన్ లో బొగ్గు వెలికి తీస్తుండగా ఒక్కసారిగా పై కప్పు కూలి బొగ్గు పెల్లలు మీదపడ్డాయి. దీంతో బొగ్గు పెల్లల కింద చిక్కుకున్న ఇద్దరు కార్మికులు అక్కడిక్కడే మరణించారు. ఈ ప్రమాదంలో మరో కొందరు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ప్రమాదంలో గాయపడ్డ వారిని సింగరేణి రెస్క్యూ సిబ్బంది వారిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోంది.
బొగ్గు గనిలో చిక్కుకుపోయిన వారిని తీసుకొచ్చేందకు సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. కాగా, ఇటీవల కాలంలో చాలా వరకు బొగ్గు గనుల్లో ఇలాంటి ప్రమాదాలు తగ్గాయి. చాలా రోజుల తర్వాత మళ్లీ ప్రమాదం చోటు చేసుకోవడంతో కార్మికులు భయాందోళనకు గురవుతున్నారు.