ఇటీవల మంచిర్యాలలో మహేష్ అనే యువకుడి ప్రియురాలి కుటుంబ సభ్యులు నడిరోడ్డుపై దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. తాజాగా పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.
మంచిర్యాలలోని ఇందారంలో మహేష్ అనే యువకుడిని యువతి కుటుంబ సభ్యులు నడి రోడ్డుపై అతి కిరాతకంగా హత్య చేసిన విషయం తెలిసింది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలంగా మారింది. అయితే పెళ్లైన యువతిని మహేష్ గత కొంత కాలంగా వేధిస్తున్నాడని, దీని కారణంగానే యువతి కుటుంబ సభ్యులు మహేష్ ను అతి దారుణంగా హత్య చేశారని సమాచారం. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో మహేష్ ను హత్య చేసిన నిందితులను తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో యువతి తండ్రి కనకయ్య, తల్లి పద్మతో పాటు కుమార్తెలు శ్వేత, శృతి, కుమారుడు ఉన్నారు. అనంతరం పోలీసులు మీడియాతో మాట్లాడారు.
అసలేం జరిగిందంటే?
మంచిర్యాల జిల్లా ఇందారం గ్రామంలో మహేష్ అనే యువకుడు నివాసం ఉండేవాడు. అయితే ఇదే గ్రామానికి చెందిన శృతి అనే యువతితో ఇతనికి పరిచయం ఉండేది. ఈ పరిచయంతోనే ఇద్దరూ గత కొంత కాలంగా ప్రేమించుకున్నారు. కట్ చేస్తే.. ఈ విషయం తెలుసుకున్న యువతి కుటుంబ సభ్యులు మహేష్ కు వార్నింగ్ ఇచ్చి శృతికి మరో యువకుడితో వివాహం జరిపించారు. అలా కొన్నాళ్ల తర్వాత శ్వేత ప్రేమ వ్యవహారం భర్తకు తెలియడంతో భార్యకు విడాకులిచ్చి మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో శృతి అప్పటి నుంచి పుట్టింటికి వచ్చి తల్లిదండ్రుల వద్దే ఉండేది. ఈ క్రమంలోనే శృతి ప్రియుడు మహేష్ మరోసారి తన ప్రియురాలితో మాట్లాడే ప్రయత్నం చేశాడు. దీనికి శృతి నిరాకరించినట్లుగా తెలుస్తుంది. దీంతో మహేష్ వీరిద్దరూ గతంలో మాట్లాడుకున్న న్యూడ్ వీడియో కాల్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడని సమాచారం.
అది కాస్త వైరల్ గా మారి చివరికి శృతి కుటుంబ సభ్యులకు తెలిసింది. ఇక పట్టరాని కోపంతో ఊగిపోయిన ఆ యువతి కుటుంబ సభ్యులు.. శృతి జీవితాన్ని నాశనం చేసిన మహేష్ ను ఎలాగైనా చంపాలని ప్లాన్ వేశారు. ఇందులో భాగంగానే ఇటీవల శృతి తల్లిదండ్రులతో సోదరి శ్వేత, సోదరుడు అందరూ కలిసి మహేష్ ను ఊళ్లో పట్టుకున్నారు. ఆ తర్వాత అతనిపై కత్తితో దాడి చేశాడు. అంతేకాకుండా పక్కనే ఉన్న బండరాయితో మహేష్ తలపై బలంగా మోదారు. దీంతో మహేష్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. అనంతరం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తాజాగా నిందితులను అరెస్ట్ చేశారు.