రెండు తెలుగు రాష్ట్రాల్లో బానుడి ప్రతాపం అధికంగా ఉంది. మొన్నటి వరకు వర్షం కురవగా, గత కొన్ని రోజుల నుంచి మాత్రం ఎండలు విపరీతంగా దంచి కొడుతున్నాయి. అయితే తాజాగా వడదెబ్బతో ఓ కానిస్టేబుల్ మృతి చెందాడు.
గత కొన్నిరోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు విపరీతంగా కొడుతున్నాయి. మరీ ముఖ్యంగా తెలంగాణలో దంచి కొడుతున్నాయి. ఈ ఎండల కారణంగా ఎంతో మంది కూలీలు, రైతులు వడదెబ్బకు గురవుతున్నారు. అయితే తాజాగా ఓ కానిస్టేబుల్ వడదెబ్బకు గురయ్యాడు. తోటి ఉద్యోగులు వెంటనే స్పందించి ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ, ఫలితం లేకపోవడంతో అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. తెలంగాణలోని మంచిర్యాల జిల్లా లక్షేటిపేట పరిధిలోని అంకితవాడకు చెందిన సంతోష్ రామకృష్ణపూర్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు.
ఇతడు 2000లో కానిస్టేబుల్ గా ఎంపికయ్యాడు. అయితే సంతోష్ ఎప్పటిలాగే ఆదివారం కూడా విధులకు హాజరయ్యాడు. రాత్రి 10 గంటల సమయంలో ఉన్నట్టుండి సంతోష్ వడదెబ్బకు గురయ్యాడు. వెంటనే స్పందించిన తోటి ఉద్యోగులు అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అతడు అప్పటికే వడదెబ్బతో కన్నుమూశాడని తెలిపారు. సంతోష్ మృతిచెందాడని తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా ఏడ్చారు. సంతోష్ మృతి చెందడంతో తోటి కానిస్టేబుల్లు శోక సంద్రంలో మునిగిపోయారు. మృతుడి స్వగ్రామంలో సైతం విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇదిలా ఉంటే.. గత కొన్ని రోజుల నుంచి ఎండల విపరీతంగా కొడుతున్నాయి. ఎండల తీవ్రతకు ఎంతో మంది వడెదెబ్బతో కుప్పకూలుతున్నారు. ఇక ఎండల తీవ్రత నుంచి అందరూ జాగ్రత్తగా ఉండాలంటూ అధికారులు సూచిస్తున్నారు.