తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కొడుకు. పైగా విద్యుత్ శాఖలో ఉద్యోగం రావడంతో ఎంతో మురిసిపోయారు. ఇక కుమారుడి పెళ్లి ఘనంగా చేయాలని అనుకున్నారు. ఇందులో భాగంగానే తెలిసిన అమ్మాయితో ఇటీవల నిశ్చితార్థం కూడా జరిపించారు. ఇక మరో వారం రోజుల్లో పెళ్లి అనగా..!
ఒక్కగానొక్క కొడుకు. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు ఎంతో గారబంగా పెంచి బాగా చదివించారు. ఉద్యోగంలో స్థిరపడ్డాక పెళ్లి చేయాలని అనుకున్నారు. ఇందులో భాగంగానే విద్యుత్ శాఖలో ఉద్యోగం వచ్చింది. ఇక తల్లిదండ్రులు పెళ్లి చేయాలని భావించి తెలిసిన బంధువుల్లో ఒక అమ్మాయితో ఇటీవల నిశ్చితార్థం జరిపించారు. ఇక మరో వారం రోజుల్లో పెళ్లి అనగా ఊహించని పరిణామం చోటు చేసుకుంది. దీంతో ఆ యువకుడి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేట మండలం కొత్తకొమ్ముగూడెం గ్రామం. ఇక్కడే నివాసం ఉంటున్న ఒగేటి సత్తయ్య-లక్ష్మి దంపతులకు ఓ కూతురు, కుమారుడు (24) సంతానం. కూతురు పెళ్లి గతంలోనే చేశారు. ఇక కుమారుడు సాయి బాగా చదువుకుని నిర్మల్ మండలం కొండాపూర్ విద్యుత్ శాఖలో జేఎల్ఎంగా ఉద్యోగం పొందాడు. గత కొంత కాలం నుంచి ఇక్కడే పని చేస్తున్నాడు. ఇక కొడుకు స్థిరపడడంతో తల్లిదండ్రులు పెళ్లి చేయాలని అనుకున్నారు. ఇందులో భాగంగానే ఓ యువతితో ఇటీవల నిశ్చితార్థం కూడా జరిపించారు. మే 12న పెళ్లి. ఇందు కోసం సాయి ఆఫీసుకు సెలవు పెట్టి పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యాడు.
అయితే గురువారం తన తోటి ఉద్యోగులకు పెళ్లి కార్డ్ ఇవ్వడానికి తన స్నేహితుడితో కలిసి బైక్ పై నిర్మల్ కు వెళ్లాడు. అక్కడికి చేరుకుని తన ఫ్రెండ్స్ అందరికీ పెళ్లి పత్రికలు ఇచ్చాడు. ఇక తిరుగు ప్రయాణంలో భాగంగా దండేపల్లి పరిధిలోని ఓ గ్రామం మీదకు సాయి బైక్ పై వెళ్తున్నాడు. వెనకాల నుంచి హర్వెస్టర్ వీరిని బైక్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ కిందపడిపోయారు. వెంటనే స్పందించిన స్థానికులు వారిద్దరినీ స్థానిక ఆస్పత్రికి తరలించారు. కానీ, సాయి అప్పటికే చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు. ఇక తీవ్ర గాయాలపాలైన అతడి స్నేహితుడికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇక కుమారుడి మరణవార్త తెలుసుకున్న మృతుడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మరో వారం రోజుల్లో పెళ్లి అనగా సాయి చనిపోవడంతో వారి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.