పాల్వంచలో సంచలనం సృష్టించిన రామకృష్ణ ఫ్యామిలీ సూసైడ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తన భార్యను పంపాలని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కొడుకు రాఘవ అడిగినందుకే కలత చెంది సూసైడ్ చేసుకుంటున్నామని సెల్ఫీ వీడియోలో రామకృష్ణ పేర్కొన్నాడు. రామకృష్ణ చనిపోయే ముందు తీసుకున్న మరో సెల్పీ వీడియోలో రాఘవతో ఉన్న సంబంధంతోనే అమ్మ, అక్క తనను మానసికంగా హింసించారని పేర్కొన్నారు.
ఈ క్రమంలో రామకృష్ణ తల్లి సూర్యావతి స్పందించారు. తన కొడుకు రామకృష్ణ చేసిన ఆరోపణలు అన్నీ తప్పంటోంది అతని తల్లి సూర్యావతి. అసలు ఈ కేసుతో వనమా రాఘవేంద్రకు ఎలాంటి సంబంధం లేదని చెబుతోంది. వనమా ఫ్యామిలీలో పాతికేళ్లుగా తమకు సత్సంబంధాలు ఉన్నాయని.. ఎవరో కావాలనే రాఘవేంద్రను ఇందులో ఇరికిస్తున్నారని చెప్పుకొచ్చింది. ఆత్మహత్యకు ముందు కూడా రామకృష్ణ ఉరి వేసుకొనేందుకు ప్రయత్నించినట్లు చెప్పింది. కావాలని ఎవరో తన కొడుకును ప్రేరేపించి తప్పుదోవ పట్టించి చావుకు కారణమయ్యారు.. అని రామకృష్ణ తల్లి సూర్యావతి కన్నీటి పర్యంతమయ్యారు.
ఆస్తి కోసం కుమారుడు రామకృష్ణ తనను ఎంతో ఇబ్బంది పెట్టాడని చెప్పారు. చాలాచోట్ల అప్పులు చేసిన అతను ఒకే సారి రూ.లక్షల్లో అప్పు ఉందని చెప్పాడని తెలిపారు. తన వద్ద ఉన్న డబ్బులు కూడా రామకృష్ణకు ఇచ్చానని.. అయినా నా కొడుకు పరిస్థితి మారలేదని చెప్పింది. ఆస్తి విషయంపై మాట్లాడడానికే వనమా రాఘవేంద్ర దగ్గరికి తీసుకెళ్లానని చెప్పింది.నా కొడుకు ఎలా క్షోభకు గురయ్యాడో మాకు తెలియదు. తెలిస్తే మా సమస్యను మరోలా పరిష్కరించుకునే వాళ్లం అని రామకృష్ణ తల్లి సూర్యావతి అన్నారు.
ఇది చదవండి : సెల్ ఫోన్ చోరి చేశాడని కొట్టి చంపేశారు!
ఇక రామకృష్ణ అక్క మాధవి కూడా ఈ కేసు విషయంలో స్పందించారు. తన తమ్ముడు రామకృష్ణ తనను ఎందుకు ఇరికించాడో తెలియదన్నారు మాధవి. రాఘవేంద్రతో తమకు ఎలాంటి గొడవలు లేవన్నారు. మా ఆస్తుల పంపకాల విషయంలో వనమా రాఘవేందర్రావును కలిశాం. కానీ ఆయన ఏం మాట్లాడాడో మా తమ్ముడికే తెలుసు. మాతో చెబితే పరిష్కారమార్గం ఆలోచించే వాళ్లం అని రామకృష్ణ సోదరి కొమ్మిశెట్టి లోగ మాధవి చెప్పారు. మరి.. రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో అయిన వారే ఇలా వనమా రాఘవకి మద్దతుగా మాట్లాడటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.