తెల్ల చొక్కా, పెద్దజుట్టు, పంచెకట్టు, కోరమీసం, భుజం మీద “12 మెట్ల కిన్నెర”తో అత్యంత సాధారణంగా కనిపించే అరుదైన కళాకారుడు కిన్నెర మొగిలయ్య. ఇటీవల కేంద్ర ప్రభుత్వం నుంచి కిన్నెర మొగిలయ్య పద్మశ్రీ అవార్డు కూడా అందుకున్నారు. దీంతో ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లో ఆయన పేరు వెలుగులోకి వచ్చింది. అయితే పద్మశ్రీ అవార్డు పొందిన నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన ఈ కిన్నెర మొగిలయ్య ఓ పని చేసి మానవత్వం చాటుకున్నారు.
దర్శనం మొగిలయ్య పూర్వీకులు “మెట్ల కిన్నెర” వాయిస్తూ కథలు చెప్పేవారు. వారినుంచే ఆ కళను వారసత్వంగా స్వీకరించారు. తరాల తెలంగాణ జీవన విధానాన్ని, చారిత్రక గాథల్ని ఒడిసిపట్టి, పాటల రూపంలో కిన్నెర మెట్ల ద్వారా ప్రచారం చేస్తున్నాడు. వాయిద్యాన్నే ఇంటిపేరుగా మార్చుకొని “కిన్నెర మొగిలయ్య”గా ఆయన స్థిరపడ్డారు. ఈయన ప్రతిభకు ఇటీవల పద్మశ్రీ అవార్డు లభించిన సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉంచితే .. శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో చిరిగిన దుస్తులతో ఎండలో తిరుగుతున్న ఓ యాచకుడు మొగిలయ్య కంట పడ్డాడు. ఆ యాచకుడిని చూసిన మొగిలయ్య వెంటనే పక్కనే ఉన్న వస్త్ర దుకాణంలోకి వెళ్లి కొత్త దుస్తులు కొన్నారు. అనంతరం ఆ యాచకుడికి తానే స్వయంగా దుస్తులు తొడిగి మానవత్వాని చూటుకున్నారు. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.