ఈమధ్య కాలంలో కొన్ని వింత సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వీటిని చూసిన జనాలు.. దైవ మహత్యం అంటారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది. ఆ వివరాలు..
మన దగ్గర అప్పుడప్పుడు కొన్ని వింత సంఘటనలు చోటు చేసుకుంటాయి. అవి ఎందుకు అలా జరిగాయో సైన్స్ వివరించలేదు. అలాంటి అద్బుతాలనే.. మనం దైవ మహిమగా భావిస్తాం. కొన్ని రోజుల క్రితం తెల్ల శివలింగం వెలుగులోకి రావడం.. దాన్ని తీసుకెళ్లిన వాళ్లు.. ఆ లింగం శక్తిని భరించలేక.. తిరిగి చెరువు ఒడ్డుకే తెచ్చి ప్రతిష్టించిన వైనం చదివాం. ఇక శ్రీరామనవమి రోజున.. కోతులు వచ్చి సీతారాముల మండపంలో సందడి చేయడం చూశాం. వీటన్నింటిని చూసి సగటు వ్యక్తి దైవ మహిమ అనుకుంటాడు. కానీ సైంటిస్టులు మాత్రం.. ప్రతి దాన్ని కొట్టి పారేస్తుంటారు. ఇక తాజాగా ఓ అద్భుతం వెలుగు చూసింది. సాధారణంగా పూజ చేసి మనం హారతి ఇస్తాం.. గుడిలో అయితే పూజారి హారతి ఇస్తాడు. కానీ ఇప్పుడు మీరు ఓ అద్భుతమైన దృశ్యం చూడబోతున్నారు. ఆవివరాలు..
నిర్మల్ జిల్లాలో అద్భుతం వెలుగులోకి వచ్చింది. బైంసా పట్టణంలోని శ్రీ వీర హనుమాన్ ఆలయంలో హారతి పళ్ళెం తనంతట తానే కదలడంతో భక్తులు విస్తుపోయారు. ఈ సంఘటన ఏప్రిల్ 15న శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. ప్రతిరోజు మాదిరిగానే శనివారం రాత్రి అర్చకులు హనుమాన్ ఆలయంలో పూజలు నిర్వహించి, స్వామివారికి హారతి ఇచ్చారు. తర్వాత భక్తులకు హారతి చూపించి.. రోజు మాదిరి హారతి పళ్లాన్ని స్వామి వారి ముందు పెట్టారు. ఇంతలో అనుకోని వింత చోటు చేసుకుంది. దేవుడి ముందు పెట్టిన హారతి పళ్లెం అలా కింద పెట్టగానే తనకు తానుగా కదలడం మొదలుపెట్టింది. అలా కొన్ని సెకన్ల పాటు కాదు.. ఏకంగా నాలుగు నిమిషాల పాటు ఆ పళ్లెం కదులుతూ అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.
ఈ దృశ్యాన్నిచూసి భక్తులు.. ఇదంతా ఆంజనేయ స్వామి మహిమ అంటూ భక్తి పారవశ్యంతో పొంగిపోయారు. స్వామి తమను కరుణించి ఇలా అనుగ్రహించాడని.. ఈ రూపంలో తన మహిమ చూపించారంటూ భక్తులు పొంగి పోతున్నారు. ఇక హారతి పళ్లెం కదులుతున్న వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన భక్తులు పరవశానికి లోనవుతున్నారు. ఈ వీడియోని మీరు కూడా చూడండి. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.