హైదరాబాద్‌లో బస్సులు, మైట్రో, ఎమ్‌ఎమ్‌టీఎస్ రైళ్ల మీద ఆధారపడి కొన్ని లక్షల మంది తమ ప్రయాణాలను సాగిస్తున్నారు. ఒక్క పూట వీటి సర్వీసులు నిలిచిపోయినా చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంది. అలాంటిది మూడు రోజులు పాటు ఆ రైళ్లు రద్దు కావటం ఇబ్బందికరమే..
హైదరాబాద్ ప్రజల ప్రయాణ అవసరాలు తీరుస్తున్న వాటిలో బస్సులు, మెట్రో, ఎమ్‌ఎమ్‌టీఎస్ రైళ్లు ప్రధానమైనవి. నగరంలోని చాలా మంది వీటి మీద ఆధారపడే ప్రయాణాలు సాగిస్తుంటారు. వీటిలో వేటి సేవలకు అంతరాయం కలిగినా వేల మంది ఇబ్బందిపడాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటిది మూడు రోజుల పాటు సేవలు రద్దయితే పరిస్థితి ఊహించలేము. ఇక, ఎమ్ఎమ్‌టీఎస్ రైళ్ల సర్వీసులకు సంబంధించి కేంద్ర రైల్వే శాఖ ఓ కీలక ప్రకటన విడుదల చేసింది. మూడు రోజుల పాటు ఎమ్‌ఎమ్‌టీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సౌత్ సెంట్రల్ రైల్వే తమ ట్విటర్ ఖాతాలో ఓ పోస్టు పెట్టింది. నిర్వహణ సమస్యల కారణంగా 13,14,15 తేదీల్లో రైళ్లను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది.
రద్దు చేస్తున్న ఎమ్‌ఎమ్‌టీఎస్ రైళ్ల వివరాలను విడుదల చేసింది. లింగంపల్లి-హైదరాబాద్.. ఫలక్‌నుమా-హైదరాబాద్.. ఫలక్‌నుమా-లింగంపల్లి.. రామచంద్రపురం-ఫలక్‌నుమా మధ్య నడుస్తున్న ఎమ్‌ఎమ్‌టీఎస్ సర్వీసులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. లింగంపల్లి-హైదరాబాద్ 47135, లింగంపల్లి-హైదరాబాద్ 47137, హైదరాబాద్-లింగంపల్లి 47110, హైదరాబాద్-లింగంపల్లి 47111, హైదరాబాద్-లింగంపల్లి 47119, ఫలక్‌నుమా-లింగంపల్లి 47160, ఫలక్‌నుమా-లింగంపల్లి 47156, ఫలక్‌నుమా-లింగంపల్లి 47158, ఫలక్‌నుమా-లింగంపల్లి 47214, ఫలక్‌నుమా-లింగంపల్లి 47216 రైళ్లతో కలిపి మొత్తం 19 రైళ్లు రద్దయ్యాయని వెల్లడించింది. మరి, మూడు రోజుల పాటు 19 ఎమ్‌ఎమ్‌టీఎస్ రైళ్లు రద్దు కావటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Cancellation of #MMTS Trains on 13th, 14th & 15th February, 2023 pic.twitter.com/VwEqOrLZy3
— South Central Railway (@SCRailwayIndia) February 11, 2023