ప్రస్తుతం యూపీలో ఎన్నికల హడావుడి కొనసాగుతుంది. ఈ ఎన్నికల్లో పోటీ చేసే పార్టీలు గెలుపు కోసం పటిష్టమైన వ్యూహాలను అమలు పరుస్తున్నారు. అయితే ఈసారి యూపీలో బీజేపీ, సమాజ్ వాదీ పార్టీ కి మద్య గట్టి పోటీ ఉండబోతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీ బీజేపీ ఈసారి యూపీ ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తాజాగా యూపీలో ఉండాలంటే.. యోగీకి జైకోట్టాల్సిందే అని, యోగీ కి ఓటేయాల్సిందే అని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ యూపీ ఓటర్లకు వార్నింగ్ ఇచ్చారు. ఎవరైతే బీజేపీకి ఓటేయకుంటే.. జేసీబీ, బుల్డోజర్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని.. అవి ఎవరికోసమో తెప్పిస్తామో అందరికి తెలిసే ఉంటుందని ఆయన అన్నారు.
ఇది చదవండి: నీ కోసం హైదరాబాద్ వచ్చేస్తా.. సైబర్ క్రైం ఉచ్చులో యువతి
ఎన్నికల తర్వాత ఎవరైతే యోగీకి ఓటు వేయరో వారి ఏరియాల్లో గుర్తిస్తామని అన్నారు. యూపీలో ఉండాలంటే.. యోగీ అనాల్సిందే అని వార్నింగ్ ఇచ్చారు. యూపీ ఓటర్లకు ఎమ్మెల్యే రాజా సీంగ్ ఒక రకంగా వార్నింగ్ ఇచ్చినట్లు మాట్లాడారు. యూపీలో ఉండాలంటే యోగికి జై కొట్టాలి.. లేదంటే యూపీ వదిలి వెళ్లిపోవాలి అంటూ తనదైన స్టైల్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారా అన్న విషయం పై ఇప్పుడు చర్చలు నడుస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ లో అధికార పార్టీ వర్సెస్ బీజేపీ మద్య మాటల యుద్దం నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో ఎమ్మెల్యే రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలు మరోసారి సంచలనాలకు తెరలేపాయి. ఈ విషయం పై ఇతర పార్టీ నాయకులు ఎలా స్పందిస్తారో చూడాలి.