మొన్న టీఎస్పీఎస్సీ పరీక్ష పత్రాలు, నిన్న వికారాబాద్ తాండూర్ లో పదో తరగతి ప్రశ్నపత్రాలు లీక్ అయ్యి సంచలనం సృష్టించాయి. ఇవాళ విద్యార్థులు రాసిన పదో తరగతి పరీక్షలకు సంబంధించి ఆన్సర్ షీట్స్ మిస్ అవ్వడం కలకలం రేపుతోంది.
ప్రశ్నపత్రాలు లీక్ అవ్వడమే కాదు జవాబు పత్రాలు కూడా మిస్ అవుతున్నాయి. మొన్నటి వరకూ టీఎస్పీఎస్సీ పరీక్ష పత్రాల లీకేజ్ వ్యవహారం తెలంగాణలో సంచలనంగా మారింది. తాజాగా పదో తరగతి పరీక్షల నేపథ్యంలో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు నెలకొంటున్నాయి. పరీక్షలు ప్రారంభమైన తొలి రోజే అనూహ్య సంఘటనలు చోటుచేసుకున్నాయి. వికారాబాద్ జిల్లాలోని తాండూర్ లో పదో తరగతి ప్రశ్నపత్రాలు లీకైన ఘటన మరువకముందే మరో ఘటన చోటు చేసుకుంది. విద్యార్థులు సమాధాన పత్రాలు మిస్ అయ్యాయి. పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు ఆన్సర్ షీట్స్ లో ఒక బండిల్ ఆటోలో తరలిస్తుండగా మాయమైంది. దీంతో అధికారుల్లో ఆందోళన మొదలైంది.
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండల కేంద్రంలో పదో తరగతి విద్యార్థుల సమాధాన పత్రాలు మాయమవ్వడం సంచలనంగా మారింది. సోమవారం మధ్యాహ్నం పరీక్ష పూర్తైన తర్వాత విద్యార్థుల ఆన్సర్ షీట్స్ ను పోస్టాఫీస్ కు తరలించారు. అక్కడ నుంచి ఆటోలో బస్టాండ్ కు తరలించారు. బస్టాండ్ నుంచి మూల్యాంకన కేంద్రాలకు తరలించాల్సి ఉండగా.. ఈ మధ్యలో సమాధాన పత్రాల్లోంచి ఒక బండిల్ కనిపించకుండా పోయింది. బస్సుల్లో జవాబు పత్రాల బండిల్స్ ను వేసే సమయంలో అన్ని బండిల్స్ ఉన్నాయో లేదో అని సిబ్బంది లెక్కించగా ఒక బండిల్ తక్కువ ఉంది. మొత్తం 11 బండిల్స్ ఉండాలి. కానీ 10 బండిల్స్ మాత్రమే ఉన్నాయి. ఆటోలో తీసుకురావడం వల్ల రోడ్డు మధ్యలో ఎక్కడైనా బండిల్ పడిపోయి ఉండవచ్చునని సిబ్బంది భావించారు. వెనక్కి వెళ్లి రోడ్డు మీద మొత్తం వెతికారు.
రోడ్డు మార్గంలోనూ వెతికారు. కానీ బండిల్ దొరకలేదు. దీంతో సబ్ పోస్ట్ మాస్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు జవాబు పత్రాల మిస్సింగ్ పై దర్యాప్తు చేపడుతున్నారు. పోస్టాఫీస్ సిబ్బందిని, ఆటోడ్రైవర్ ను ప్రశ్నిస్తున్నారు. ఆ బండిల్ లో 30 మంది విద్యార్థుల జవాబు పత్రాలు ఉన్నట్లు సమాచారం. జవాబు పత్రాలు మాయమవ్వడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. మరి మొన్న టీఎస్పీఎస్స్సీ పరీక్ష పత్రాలు, నిన్న తాండూర్ లో పదో తరగతి పరీక్ష పత్రాలు లీక్ అవ్వడం, ఇప్పుడు ఆటోలో తరలిస్తుండగా సమాధాన పత్రాల బండిల్స్ లో ఒక బండిల్ మిస్ అవ్వడం వంటి సంఘటనలు.. తెలంగాణలోనే వరుసగా విద్యార్థుల భవిష్యత్తు విషయంలోనే ఎందుకు ఇలా జరుగుతున్నాయనేది అర్థం కావడం లేదు. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.