సాధారణంగా వివాహం అంటే స్త్రీ, పురుషుల మధ్య జరిగే తంతు. అయితే కాలం మారుతున్న కొద్ది.. కొన్ని పద్దతులు కూడా మారుతూ వస్తున్నాయి. ప్రస్తుతం కోర్టులు స్వలింగ వివాహాలకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి వాటిని సమాజం మాత్రం ఇంకా అంగీకరించడం లేదు. ఇదంతా ఓకే కానీ.. ఇప్పుడు మీరు చదవబోయే సంఘటన వేరే లెవెల్. ఎందుకంటే ఇక్కడ ఇద్దరు మగాళ్లు పెళ్లి చేసుకున్నారు. సరే ఇవ్వాళ, రేపు ఇలాంటివి జరుగతున్నాయి కదా అనుకుంటే.. అసలు ట్విస్ట్ అక్కడే ఉంది. వీరిద్దరు ఒకరిని ఒకరు ప్రేమించుకుని ఇలా పెళ్లి పీటలు ఎక్కలేదు. తప్పతాగి.. ఆమైకంలో వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. మత్తు దిగాక అసలు ట్విస్ట్ వెలుగు చూసింది. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి: విలన్‌తో టాలీవుడ్ హీరోయిన్ ప్రేమాయాణం.. త్వరలోనే పెళ్లి!
ఈ వింత సంఘటన మెదక్ జిల్లా చిలప్‌చెడ్‌లో మంగళవారం వెలుగు చూసింది. ఈ ఘనకార్యానికి పాల్పడ్డ వారిలో ఒకరు సంగారెడ్డి జిల్లా జోగిపేటకు చెందిన 21 ఏళ్ల యువకుడు కాగా.. మరొకరు చిలప్‌చెడ్ మండలం చండూర్‌కు చెందిన 22 ఏళ్ల ఆటో డ్రైవర్. ఇక వీరిద్దరికి కొల్చారం మండలం దుంపలకుంటలోని ఓ కల్లు దుకాణంలో పరిచయం ఏర్పడింది. అప్పుడప్పుడు ఇద్దరు ఫ్రెండ్షిప్ కొద్ది కలుసుకుని.. ఫుల్లుగా తాగి ఎంజాయ్ చేసేవారు. ఈ క్రమంలోనే ఏప్రిల్ 1న వీరిద్దరు కలుసుకుని.. ఫుల్లుగా తాగారు.
ఇది కూడా చదవండి: మిస్ కాకండి! ఇలా పెళ్లి చేసుకుంటే.. రూ.2.5 లక్షలు మీ అకౌంట్ లోకి..!
మరి ఏమైందో ఏమో తెలియదు కానీ.. తాగిన మైకంలో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఆటోడ్రైవర్.. జోగిపేట యువకుడికి తాళి కట్టాడు. సరే.. ఏదో తాగిన మైకంలో చేసిన పని.. మత్తు వదిలాకా వారే.. సిగ్గుపడతారు అని భావిస్తే.. మీరు తప్పులో కాలేసినట్లే. మత్తు దిగాకా.. మన జోగిపేట జాతిరత్నం ఏకంగా కాపురం చేస్తానంటూ ఆటో డ్రైవర్ ఇంటికి వెళ్లాడు. మెడలో తాళితో.. వచ్చిన జోగిపేట యువకుడిని చూసి.. ఆటోడ్రైవర్‌కు మత్తు దిగడమే కాక.. రాత్రి తాము చేసిన ఘనకార్యం గుర్తుకు వచ్చింది.
‘‘అరే.. అదేదో మత్తులో జరిగిపోయిందిరా నాయనా.. నువ్వేంది ఇలా ఇంటికి వచ్చావ్.. నడు మీ ఇంటికి పో’’ అంటే.. మన జోగిపేట జాతిరత్నం.. అదే కుదరదు.. తాళి కట్టావ్ కనుక కాపురానికి వచ్చాను అని షాక్ ఇచ్చాడు. వీరిద్దరి వ్యవహారం చూసి ఆటోడ్రైవర్ తల్లిదండ్రులకు మూర్ఛ వచ్చినంతపనైంది. అదేదో తాగిన మైకంలో జరిగింది.. మీ ఇంటికి వెళ్లు బాబు.. అని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ మన జోగిపేట జాతిరత్నం వారి మాటలు వినలేదు. ఏకంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి.. ఫిర్యాదు చేశాడు. లక్ష రూపాయలు ఇస్తే కానీ ఫిర్యాదు వాపసు తీసుకోనని తెలిపాడు.
ఇది కూడా చదవండి: స్టార్ హీరో పెళ్లి ఫిక్స్! కట్నంగా రూ.20 కోట్లు!
వీరిద్దరి వ్యవహారం చూసి తలలు పట్టుకున్న పోలీసులు.. గ్రామ పెద్దలు, ఇరు కుటుంబాల సభ్యులను పిలిపించి.. చర్చించారు. చివరకు ఆటో డ్రైవర్ కుటుంబ సభ్యులతో పదివేల రూపాయలు ఇప్పించడంతో ఈ కథ సుఖాంతమైంది. డబ్బులు తీసుకుని.. ఫిర్యాదు వాపసు తీసుకున్నాడు మన జోగిపేట జాతిరత్నం. ఈ పంచాయితీ చూసిన వాళ్లు.. మీ దుంపలు తెగ.. పరువు తీశారు కదరా సామీ అంటూ చివాట్లు పెడుతున్నారు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.