హైదరాబాద్‌లోని ఓ పెయింట్ దుకాణంలో ప్రమాదవశాత్తు భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కూకట్‌పల్లిలోని ఆల్విన్ కాలనీ సమీపంలోని ఇంటిరియర్, పెయింట్ దుకాణంలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఇక స్థానికుల సమాచారం మేరకు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు.
వెంటనే స్పందించిన ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి మంటలను కాస్త అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఇక దీనిపై షాపు యజమాని స్పందించి కన్నీటి పర్యంతమయ్యారు.షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు అంటుకున్నాయని, దీంతో భారీగా ఆస్తి నష్టం జరిగిందని షాపు యజమాని వాపోతున్నాడు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు.