భూమిపై పుట్టి ఏదో సాధించాలన్న కోరిక ప్రతీ ఒక్కరికి ఉంటుంది. ముఖ్యంగా మహిళల విషయానికొస్తే గనుక పెళ్లి కన్న ముందు తమకు నచ్చిన పనులు చేస్తూ హాయిగా జీవిస్తారు. తీరా పెళ్లి చేసుకున్నాక భర్తకు, అత్తింటివాళ్లకు నచ్చిన రీతిలో ఉండాలనేది మన భారతీయ సంస్కృతి విధానం. ఇక ఎన్నో ఏళ్ల నుంచి ఈ విధానం అమలు జరుగుతూనే ఉంది. కానీ ఇక్కడ మరో విషయం ఏంటంటే..? ఏదేదో చేయాలని, ఏదో సాధించాలన్న కోరికతో కొందరు యువతులు భవిష్యత్ ఆశలపై కలలు కంటుంటారు. కానీ తీరా పెళ్లై అత్తింట్లో అడుగు పెట్టారా.. ఇక అంతే ఆశలన్నీ అడియాసలే అవుతున్నాయి.
తాజాగా ఇలాంటి అనుభవాలతో ఓ స్త్రీ తన అవేదనను ఇలా పంచుకుంది. నా పేరు విద్య.. నేను ఎంబీఏ పూర్తి చేశాను. నాకు జీవితంపై చాలా ప్లాన్స్ ఉండేవి. ఏదైనా మంచి పొజిషన్ లో ఉండాలని కలగనేదాన్నని, సొంతం గా ఓ ఫిట్ నెస్ సెంటర్ ను పెట్టి రన్ చేయాలనేది నా బలమైన కోరిక అని తెలిపింది. దీంతో ఇదే విషయాన్ని పెళ్లికి ముందు నా తల్లిదండ్రులకు చెప్పానని, వాళ్లు ముందు పెళ్లి చేసుకో.. ఆ తర్వాత నీ ఇష్టమని అన్నారు. ఇక నేను చేసేదేం లేక వాళ్లను నమ్మి పెళ్లి చేసుకున్నాను.
అలా నాలో ఉన్న కోరికను చంపుకోకుండా కొన్నాళ్లు జీవితాన్ని గడిపాను. ఇక అత్తింటి వాళ్లకు కూడా ఇదే విషయాన్ని పలుమార్లు చెప్పే ప్రయత్నం చేశాను. వాళ్లు నా నిర్ణయానికి అడ్డుపడకపోయినా.. పుట్టిన బిడ్డల ఆలనా పాలన చూసుకోవటంతోనే నా సమయమంత కేటాయించాల్సి వచ్చేది. ఇక స్త్రీలు ఏం చేయాలన్న ముందుగా భర్త పర్మిషన్ ఉండాలనేది కూడా భారతీయ సంస్కృతిలో భాగమై పోయిందని విధ్య అంటోంది. ఇలా ఇప్పటికీ ఎంతో మంది యువతులు వాళ్ల కోరికను చంపుకోలేక బతుకుతున్నారని విధ్య తనలో నలిగిపోతున్న ఆశలను తన మాటలతోనే తెలియజేసింది. ఇక ఇలాంటి విధ్యలు సమాజంలో ఎంతో మంది ఉన్నారనేది కాదనలేని వాస్తవం. తనలోని ఆశలను చంపుకోలేక పోతున్న విధ్య ఆవేదనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.