ఓ పెళ్లైన మహిళ భర్తను కాదని ప్రియుడితో చీకటి కాపురాన్ని ప్రారంభించింది. ఇక ఇంతటితో ఆగని ఈ ఇల్లాలు.. పుట్టిన పిల్లలు, తాళి కట్టిన భర్తను లెక్కచేయకుండా ఎంచక్కా ప్రియుడితో లేచిపోయింది. ఈ ఘటన జరిగింది ఎక్కడో కాదు..!
ఆమెకు పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎలాంటి కష్టం రాకుండా భర్త భార్యను చూసుకుంటున్నాడు. ఇక అడిగిందల్లా కాదనకుండా కొనిస్తూ ఏ లోటు రాకుండా చూసుకుంటూ వస్తున్నాడు. అలా కొంత కాలం పాటు ఈ దంపతుల కాపురం సజావుగానే సాగింది. కానీ, కొన్నాళ్ల తర్వాత భార్య చేసిన పనికి ఓ కుటుంబం రోడ్డున పడాల్సిన అవసరం వచ్చింది. ఇక భార్య చేసిన పనికి భర్త అవమానంతో తట్టుకోలేక సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అసలు ఈ ఘటనలో ఏం జరిగిందంటే?
అది గుజరాత్ అహ్మదాబాద్ లోని ఓ ప్రాంతం. ఇక్కడే ముఖేష్ (18) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతనికి 18 ఏళ్ల కిందటే వివాహం జరిగింది. పెళ్లైన కొన్నాళ్ల పాటు భార్యాభర్తల వైవాహిక జీవితం సాఫీగానే సాగింది. అలా కొన్నేళ్లు గడిచినా తర్వాత ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు జన్మించారు. ఆ పిల్లలు కూడా పెరిగి పెద్దవారయ్యారు. ఎంచక్కా స్కూల్ కు వెళ్తూ బాగానే చదువుకుంటున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ముఖేష్ భార్య స్థానికంగా ఉండే ఓ వ్యక్తితో చీకటి కాపురాన్ని ప్రారంభించింది.
భర్తకు తెలియకుండా ఆ మహిళ ప్రియుడితో తెగ రొమాన్స్ ను పండించింది. ఇక సమయం దొరికినప్పుడల్లా ప్రియుడితో కలిసి తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ వచ్చింది. అలా కొన్నాళ్ల తర్వాత ఆ మహిళకు భర్త కంటే ప్రియుడంటేనే ఎక్కువ ఇష్టం పెరిగింది. ఇక ఇలా అయితే కాదని భావించిన ఆ మహిళ… ఇటీవల వీరి వివాహ వార్షికోత్సవం రోజూనే భర్త ముఖేష్ కళ్లుగప్పి ప్రియుడితో లేచిపోయింది. భార్య సాయంత్రం అయినా ఇంటికి రాకపోవడంతో భర్తకు అనుమానం వచ్చింది.
ఇక మొత్తానికి ముఖేష్ నా భార్య తన ప్రియుడితో లేచిపోయిందని తెలుసుకున్నాడు. ఈ అవమానాన్ని ముఖేష్ తట్టుకోలేకపోయాడు. ఇలాంటి బతుకు నాకు వద్దు అనుకున్నాడో ఏమో తెలియదు కానీ, పిల్లల స్కూల్ ఫీజులు చెల్లించి గురువారం రాత్రి వీడియో తీసుకుని ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. తల్లి ప్రియుడితో వెళ్లిపోవడం, తండ్రి ఆత్మహత్య చేసుకోవడంతో.. పిల్లలు తల్లిదండ్రులు లేని అనాథలయ్యారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.