ఈమధ్యకాలంలో చోటు చేసుకునే కొన్ని సంఘటనలు చూస్తే.. నిజమో.. అబద్దమో అర్థం కాక తల పట్టుకోవాల్సి వస్తోంది. తాజాగా ఓ వింత సంఘటన వెలుగు చూసింది. వివాహిత మహిళ ఒకరు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి.. లవర్‌తో పెళ్లి చేయాలంటూ రచ్చ రచ్చ చేసింది. ఆ వివరాలు..
మన సమాజంలో పెళ్లికి చాలా పవిత్ర స్థానం ఉంది. ఒక్కసారి మూడు ముళ్లు పడితే.. ఇక జీవితాంతం తనే భాగస్వామి. ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా సరే.. వివాహ బంధానికి కట్టుబడి ఉండాలని.. పెళ్లి బంధాన్ని నిలుపుకోవాలని ప్రయత్నిస్తారు. ఎన్ని సమస్యలు వచ్చినా సర్దుకుపోవాలని భావిస్తారు. ఇక తమ వల్ల కాదు అనుకున్నప్పుడు మాత్రమే.. ఆ బంధానికి ముగింపు పలకాలని భావిస్తారు. పాశ్చాత్య దేశాలతో పోలిస్తే.. మన దగ్గర విడాకులు తీసుకునే వారు తక్కువ. అయితే గతంతో పోలిస్తే.. నేటి కాలంలో మన దగ్గర విడాకులు తీసుకునే జంటలు పెరుగుతున్నాయి. ఇక కొందరు మరో అడుగు ముందుకు వేసి.. పెళ్లైన తర్వాత.. భర్తను వదిలేసి.. ప్రేమించిన వాడితో వెళ్లి పోతున్నారు. మరి కొందరు ఇంకో అడుగు ముందుకు వేసి.. ప్రేమించిన వాళ్ల కోసం భాగస్వామిని హత్య చేస్తున్నారు. ఇక తాజాగా ఓ వింత సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..
ఆమె పెళ్లికి ముందు ఓ వ్యక్తిని ప్రేమించింది. కానీ తల్లిదండ్రులు.. ఆమె ప్రేమించిన వాడిని కాదని.. మరో వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. కొన్నాళ్లు బాగానే ఉన్న మహిళ సడెన్‌గా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి.. తనకు లవర్‌తో వివాహం చేయాలంటూ కూర్చుంది. పోలీసులు ఆమెకు ఎంత నచ్చజెప్పాలని ప్రయత్నించినా కుదరలేదు. స్టేషన్‌లోనే రచ్చ రచ్చ చేసి.. పోలీసులకే చుక్కలు చూపించింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాట్‌కొత్వాలి ప్రాంతంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బసేలా గ్రామానికి చెందిన అనిల్ శర్మ అనే యువకుడికి కాజల్ అనే మహిళతో గత ఏడాది ఫిబ్రవరి 18న వివాహం అయ్యింది.
అయితే పెళ్లికి ముందే కాజల్.. వేరే వ్యక్తిని లవ్ చేసింది. కానీ తల్లిదండ్రులు మాత్రం అనిల్ శర్మకిచ్చి వివాహం చేశారు. ఏడాది పాటు బాగానే ఉంది. మరి ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.. రెండు రోజుల క్రితం సడెన్‌గా పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. తనకు గతేడాది అనిల్ శర్మతో వివాహం అయ్యిందని చెప్పింది. దాంతో పోలీసులు.. అత్తింటి వారు ఏమన్నా వేధిస్తున్నారా.. భర్త ఇబ్బంది పెడుతున్నాడా అని ప్రశ్నించారు. లేదని తెలిపింది. మరి సమస్య ఏంటి అని అడగ్గా.. నేను పెళ్లికి ముందే వేరే వ్యక్తిని ప్రేమించాను. కానీ పెద్దలు ఒప్పుకోలేదు. ఇప్పుడు మీరే నాకు లవర్‌తో వివాహం జరిపించండి అని తన మనసులోని మాట బయటపెట్టింది.
ఆమె కోరిక విని పోలీసులే షాక్ అయ్యారు. వివాహమైన మహిళ.. లవర్‌తో మళ్లీ పెళ్లి చేయమని కోరడం ఏంటని ఆశ్చర్యపోయారు. అలా చేయడం జరగదు.. అది సామాజికంగా, చట్టపరంగా కూడా తప్పే అని కాజల్ శర్మకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఆమె వారి మాటలు వినలేదు. నా లవర్‌తో నాకు పెళ్లి చేస్తారా లేదా అంటూ పోలీస్ స్టేషన్‌లో రచ్చ రచ్చ చేసింది. అధికారులకు చుక్కలు చూపింది. పిచ్చిపట్టినట్లు అరుస్తూ.. స్టేషన్‌లో రణరంగం సృష్టించింది. లేడీ కానిస్టేబుల్స్ ఆపే ప్రయత్నం చేసినా.. ఆమె ఊరుకోలేదు.
చివరకు ఇద్దరూ లేడీ కానిస్టేబుల్స్.. ఎలాగో అలా ప్రయత్నించి.. కాజల్ శర్మను పక్కకు లాక్కెళ్లారు. తర్వాత వివాహిత కుటుంబ సభ్యులను పిలిపించి.. ఆమెను అప్పగించారు. ఆమెకు కౌన్సిలింగ్ ఇప్పించాలని సూచించారు. కాజల్ శర్మను అక్కడి నుంచి తీసుకెళ్లిన తర్వాత హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నారు. అయితే కొందరు మాత్రం.. ఇది ప్రాంక్ ఏమో.. కావాలని చేశారేమో అని కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.