ఈ రోజుల్లో కొందరు మహిళలు కట్టుకున్న భర్తను కాకుండా పరాయి వాడి పడక సుఖం కోసం వెంపర్లాడుతున్నారు. ఇంతటితో ఆగకుండా అతడితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తూ.. చివరికి భర్తను, పిల్లలను కాదని ప్రియుడితో వెళ్లిపోతున్నారు. ఇక కోరుకున్న ప్రియుడితో ఉండేందుకు అడ్డు ఎవరు వచ్చినా.. చివరికి వారిని అంతం చేసేందుకు కూడా వెనకాడడం లేదు. ఇదిలా ఉంటే ఓ వివాహితన తన ప్రియుడితో పడక సుఖం ఊహించని రీతిలో దారుణానికి పాల్పడింది. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేస్తుంది.
యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఓ వివాహితకు పెళ్లై ముగ్గురు పిల్లలు ఉన్నారు. భర్తతో కొంత కాలం పాటు ఆమె బాగానే సాంసారం చేసింది. అయితే రాను రాను ఆ వివాహిత స్థానికంగా ఉండే ఓ యువకుడితో చీకటి ప్రేమాయణాన్ని నడిపించింది. ఇక ఇటీవల భర్తను కాదని తన ముగ్గురు పిల్లలను తీసుకుని ప్రియుడితో యాదాద్రికి వెళ్లింది. కానీ, అక్కడికి వెళ్లాక ఆ వివాహిత ప్రియుడితో ఉండేందుకు పిల్లలు అడ్డుగా ఉన్నారని అనుకుంది. దీంతో ఆ మహిళ పక్కా ప్లాన్ ప్రకారం.. తన ముగ్గురు పిల్లల కాళ్లు, చేతులు కట్టేసి, వారి నోట్లో గుడ్డలు కుక్కి అక్కడే వదిలేసి ప్రియుడితో పరారైంది.
ఏడుస్తూ కనిపించిన ఆ పిల్లలను గమనించిన పోలీసులు స్టేషన్ కు తరలించారు. ఇక ఆ పిల్లలు చెప్పిన వివరాల ప్రకారం వారి బంధువులకు సమాచారం అందించారు. ఇక బంధువులు కూడా మాకు సంబంధం లేదని చేతులు ఎత్తేయడంతో పోలీసులు ఆ పిల్లలను హైదరాబాద్ లోని ఓ బాలల సంరక్షణ కేంద్రానికి తీసుకెళ్లారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమవుతోంది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.