గత కొన్నాళ్ల నుంచి హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లిపై చాలా రూమర్స్ వినిపించాయి. ఇప్పుడు వాటికి బలం చేకూరేలా ఓ కుర్రాడితో కలిసి కనిపించింది. అదీ కూడా సేమ్ కలర్ డ్రస్ లో. దీంతో ఇది కాస్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
హీరోయిన్ కీర్తి సురేష్ గురించి కొత్తగా చెప్పడానికి ఏం లేదు. మలయాళ భామ అయినప్పటికీ, తెలుగమ్మాయిలా కలిసిపోయింది. పవన్, మహేష్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకుంది. రీసెంట్ గా ‘దసరా’ హిట్ కొట్టిన ఈ బ్యూటీ పెళ్లిపై ఎప్పటినుంచో రూమర్స్ వినిపిస్తున్నాయి. వాటిని జనాలు చూసిచూడనట్లు వదిలేశారు. కానీ సడన్ గా ఓ కుర్రాడితో కనిపించేసరికి అతడే కీర్తి బాయ్ ఫ్రెండ్ అని ఫిక్సవుతున్నారు. ఎవరతడు అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకీ ఏంటి విషయం?
ఇక వివరాల్లోకి వెళ్తే.. మలయాళ నిర్మాత సురేష్ కుమార్-నటి మేనకల సంతానం కీర్తి సురేష్. ఫ్యామిలీది మూవీ బ్యాక్ గ్రౌండ్ కావడంతో చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా ఏళ్ల క్రితమే పలు మలయాళ సినిమాల్లో నటించింది. 2013లో ‘గీతాంజలి’ మూవీతో లీడ్ యాక్టర్ గా మారిపోయింది. ‘నేను శైలజ’తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కీర్తి.. ఆ వెంటనే పవన్ ‘అజ్ఞాతవాసి’ చేసింది కానీ అది ఫెయిలైంది. సావిత్రి బయోపిక్ ‘మహానటి’లో లీడ్ రోల్ చేసిన ఈ బ్యూటీ.. ఏకంగా నేషనల్ అవార్డు అందుకుని ప్రతి ఒక్కరూ షాకయ్యేలా చేసింది. ఆ తర్వాత సినిమాల విషయంలో పెద్దగా కలిసి రాలేదు. రీసెంట్ టైంలో ‘సర్కారు వారి పాట’, ‘దసరా’ మాత్రమే కీర్తి కెరీర్ లో హిట్ మూవీస్.
సరే సినిమాల గురించి పక్కనబెడితే.. కీర్తి సురేష్ పెళ్లి గురించి చాలారోజుల నుంచి పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఓ బిజినెస్ మ్యాన్ ని మ్యారేజ్ చేసుకోనుందని తెగ మాట్లాడుకున్నారు. కానీ దానికి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. తాజాగా ఓ కుర్రాడితో కలిసి కీర్తి కనిపించింది. అతడు బిజినెస్ మ్యాన్ ఫర్హాన్ అని, ఎప్పటినుంచి కీర్తి ఇతడితో లవ్ లో ఉందని అంటున్నారు. త్వరలో వీళ్ల ఒక్కటయ్యే ఛాన్స్ ఉందని సమాచారం. వీళ్లిద్దరూ కలిసున్న ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో ఇది కాస్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది. మరి కీర్తి సురేష్ బాయ్ ఫ్రెండ్ అని వైరల్ అవుతున్న పిక్ పై మీరేం అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.