సాధారణంగా మనుషులకు కొన్ని సాదు జంతువులతో ఎంతో అనుబంధం ఉంటుంది. తమ సొంతవారికన్నా ఎక్కువగా ప్రేమిస్తుంటారు. ఆ జంతువులు కూడా తమ యజమానే లోకం అన్న తీరుగా ఉంటాయి. మనుషుల ప్రేమ, విశ్వాసం గురించి ఈ కాలంలో ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.
ఇక పెట్స్ అంటే తమ ప్రాణాలు ఇచ్చేంతగా ప్రేమిస్తుంటారు. వాటికి ఏం జరిగినా విల విలాడిపోతుంటారు. ఆ పెట్స్ కూడా తమ యజమాని పట్ల అంత విశ్వనీయతగా ఉంటాయి. విశ్వాసం చూపించడంలో జంతువులు వంద రెట్లు మేలని ఎన్నో సంఘటనల్లో చూశాం. అందుకే ఈ కాలంలో చాలా మంది పెట్స్‌ను తమ కుటుంబ సభ్యుల్లా చూసుకుంటున్నారు. తాజాగా యాదగిరిగుట్ట మండలం గౌరయపల్లికి చెందిన గుజ్జుల రామచంద్ర రెడ్డి కుటుంబం కూడా ఓ పిల్లిని ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నారు. ఆ పిల్లిని ఓ జంతువుగా కాకుండా తమ ఇంటి సభ్యుల్లో ఒకరిగా చూసుకుంటున్నారు. ఆ పిల్లి రామచంద్రారెడ్డి పిల్లలో బాగా అటాచ్ కావడంతో.. చాలా సమయం దానితోనే గడుపుతున్నారు.
ఈ క్రమంలో ఒక్కసారిగా పిల్లి కనిపించకుండా పోయింది.. చుట్టుపక్కల వెతికినా కూడా ప్రయోజనం కనిపించలేదు. తాము ఎంతో ఇష్టంగా చూసుకుంటున్న పిల్లి కనిపించకపోవడంతో పిల్లలు అన్నం తినడం మానేశారు. దాంతో తో గుజ్జుల రామచంద్ర రెడ్డి తన పెంపుడు పిల్లి అపహరణకు గురైందని యాదగిరిగుట్ట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పిల్లి కనిపించకపోవడంతో రెండు రోజుల నుంచి తన కొడుకులు అన్నం తినడంలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. పిల్లి ఆచూకి కనుగొనాలని అతడు ఫిర్యాదులో కోరాడు. ఇదిలా ఉంటే.. పిల్లి కనిపించడం లేదని పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన వార్త స్థానికంగా చర్చనీయాంశమైంది.