ప్రేమించి, పెళ్లి చేసుకున్నభర్త తనను వదిలి వెళ్లిపోయాడని..ఓ భార్య.. కడుపున పుట్టిన బిడ్డల్ని రోడ్డు పాలు చేసిన ఉదంతమిది. ఆ ముగ్గురు పిల్లలు దిక్కు మొక్కు లేకుండా రోడ్డుపై ఏడుస్తుంటే.. గుర్తించిన ట్రాఫిక్ పోలీసు వారిని బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఈ ఘటన యాదగురి గుట్టలో జరగ్గా, ఆలస్యంగా వెలుగు చూసింది. అయితే తమ పట్ల తల్లి కనబర్చిన తీరు గురించి ఆ పిల్లలు చెబుతుంటే.. పోలీసులు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీని సైతం కన్నీరు పెట్టించింది. […]
పైన ఫొటోలో అమాయకంగా కనిపిస్తున్న మహిళ పేరు కంసాని అనసూయ. వయసు 45 ఏళ్లకు పైనే ఉంటుంది. యాదగిరిగుట్టకు చెందిన ఈ మహిళ ఎవరూ ఊహించని రీతిలో దారుణానికి ఒడిగట్టింది. చూడటానికి అమాయకంగా కనిపిస్తున్నా… ఆమె లెక్కలు వేరే లెవల్ లో ఉన్నాయి. అందమైన అమ్మాయిలను బుట్టలో వేసుకుని బలవంతంగా వ్యభిచార రొంపిలోకి తీసుకెళ్తుంది. కాదు, కూడదు అని అంటే మాత్రం ఏవేవో చెప్పి మోసం చేస్తుంది. ఇలా ఎంతో మంది మైనర్ బాలికలను బలవంతంగా గదిలోకి […]
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం సాయంత్రం యాదగిరిగుట్టలో ఓ రెండతస్తుల పాత భవనం కుప్పకూలి నలుగురు మృతి చెందారు. ప్రధాన రహదారికి పక్కనే ఉన్న శ్రీరాంనగర్ లో జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి […]
సాధారణంగా మనుషులకు కొన్ని సాదు జంతువులతో ఎంతో అనుబంధం ఉంటుంది. తమ సొంతవారికన్నా ఎక్కువగా ప్రేమిస్తుంటారు. ఆ జంతువులు కూడా తమ యజమానే లోకం అన్న తీరుగా ఉంటాయి. మనుషుల ప్రేమ, విశ్వాసం గురించి ఈ కాలంలో ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇక పెట్స్ అంటే తమ ప్రాణాలు ఇచ్చేంతగా ప్రేమిస్తుంటారు. వాటికి ఏం జరిగినా విల విలాడిపోతుంటారు. ఆ పెట్స్ కూడా తమ యజమాని పట్ల అంత విశ్వనీయతగా […]