పైన ఫొటోలో అమాయకంగా కనిపిస్తున్న మహిళ పేరు కంసాని అనసూయ. వయసు 45 ఏళ్లకు పైనే ఉంటుంది. యాదగిరిగుట్టకు చెందిన ఈ మహిళ ఎవరూ ఊహించని రీతిలో దారుణానికి ఒడిగట్టింది. చూడటానికి అమాయకంగా కనిపిస్తున్నా… ఆమె లెక్కలు వేరే లెవల్ లో ఉన్నాయి. అందమైన అమ్మాయిలను బుట్టలో వేసుకుని బలవంతంగా వ్యభిచార రొంపిలోకి తీసుకెళ్తుంది. కాదు, కూడదు అని అంటే మాత్రం ఏవేవో చెప్పి మోసం చేస్తుంది. ఇలా ఎంతో మంది మైనర్ బాలికలను బలవంతంగా గదిలోకి పంపి.. చీకటి బిజినెస్ కు పావులు కదుపుతోంది. అసలు ఈ మహిళ ఎవరు? ఆమె చేసిన దారుణాలు ఏంటనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. యాదగిరిగుట్టలోని యాదగిరిపల్లి కంసాని అనసూయ అనే మహిళ నివాసం ఉంటుంది.
అయితే కష్టపడి సంపాదించకుండా ఈ మహిళ ఈజీగా డబ్బులు సంపాదించే మార్గాలు వెతికింది. ఇందుకోసం అమే అనేక ప్రయత్నాలు చేసి చివరికి విఫలం అయింది. ఇక ఆ తర్వాత ఆమెకు వచ్చిన ఐడియా వ్యభిచారం. ఆమె చేయడం కాదు.. మైనర్ బాలికలను ఇందులోకి బలవంతంగా దింపడం. ఇందుకోసం ఈ మహిళ కాదు కాదు.. రాక్షసి చిన్న పిల్లలను శిశువులుగా ఉన్నప్పుడే కొనుగోలు చేస్తుంది. వారు పెరిగి 13 ఏళ్ల వయసు వచ్చే వరకు ఆగుతుంది. కాస్త చూడ్డానికి అందంగా కనిపిస్తే చాలు… మెల్ల మెల్లగా వ్యభిచారాన్ని పరిచయం చేస్తుంది.
ముందుగా ఓ రేటుకు మాట్లాడుకుని బలవంతంగా విటుల బాలికలను పంపిస్తుంది. ఇలా ఎంతో మంది బాలికలతో పాటు మహిళలను వ్యభిచారంలోకి దింపి కొత్త బిజినెస్ కు శ్రీకారం చుట్టింది. ఈ విషయం ఇరుగు పొరుగు వారు తెలుసుకుని అనసూయ చేస్తున్న చీకటి దందాన్ని బయట పెట్టాలని అనుకున్నారు. ఇక ఈ విషయం చివరికి పోలీసుల వరకు వెళ్ళటంతో షాక్ గురయ్యారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేయకున్న పోలీసులు ఆ మహిళను విచారించారు. మొదట్లో నాకేం తెలియదు అని నమ్మించే ప్రయత్నం చేసింది. ఇక చివరికి పోలీసులు స్టైల్ లో విచారించేసరికి అనసూయ సాగించిన చీకటి వ్యభిచారం బయటపడి ఒప్పుకుంది.ఆ తర్వాత పోలీసులు ఆ మహిళతో పాటు మరో ఐదు మందిని అరెస్ట్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.