కావలి పవన్ కుమార్ యాదవ్.. దేవరకద్ర నియోజకవర్గం, కౌకుంట్ల గ్రామంలో ఈ పేరు బాగా వినిపిస్తూ ఉంటుంది. ఈ యువ వ్యాపారవేత్త రాజకీయాల్లోకి అడుగుపెట్టి ప్రజలకు సేవ చేయాలనే గట్టి పట్టుదలతో ఉన్నాడు. గతంలో కూడా తాను రాజకీయ పార్టీలో చేరబోతున్నాడని చెప్పి.. తర్వాత జాయిన్ కాని పరిస్థితిని చూశారు. అయితే అసలు రాజకీయాల్లో చేరతారా? లేదా? చేరితే ఏ పార్టీలో చేరతారు? అని పలు ఆసక్తికర విషయాలను సుమన్ టీవీకి ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
కావలి పవన్ కుమార్ యాదవ్.. వ్యాపారాలు చేసుకుంటూనే తన గ్రామ, నియోజకవర్గంలోని ప్రజలకు సేవలు చేస్తూ ఉంటారు. అయితే గత కొద్దిరోజులుగా పవన్ కుమార్ ప్రజలకు అందుబాటులో లేరు అనే వార్తలు వినిపించాయి. వాటిపై పవన్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. “నేను ఒక నెల రోజుల నుంచి నియోజకవర్గానికి వెళ్లడం లేదనేది నిజమే. నేను అయ్యప్ప దీక్షలో ఉన్నాను. రెండు నా సొంత కంపెనీ పనిలో కాస్త బిజీగా ఉండటం వల్ల నేను నియోజకవర్గానికి కాస్త దూరంగా ఉన్నాను. కానీ, నా నియోజకవర్గం ప్రజలు మాత్రం నా గుండెల్లోనే ఉంటారు. నేను ఎక్కడున్న వారు నాతోనే ఉంటారు” అంటూ పవన్ కుమార్ వ్యాఖ్యానిచారు.
గతంలో బండి సంజయ్ సమక్షంలో పార్టీలో చేరతారని చెప్పి.. తప్పుకున్న విషయంపై ప్రశ్నించగా.. “గతంలో బండి సంజయ్ గారు మా నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న సమయంలో 10 వేలమంది నా ఫాలోవర్స్ తో పార్టీలో చేరాలని ప్లాన్ చేసుకున్నాం. అందుకు పార్టీ కూడా ఒప్పుకుంది. లాస్ట్ మినిట్ లో నా హెల్త్ పాడై నేను ఆస్పత్రిలో చేరాను. దానిని పార్టీ వర్గాలకు తప్పుగా చెప్పారు. నేను కావాలనే పార్టీలో చేరలేదనే భావన కలిగించారు. నేను కచ్చితంగా బీజేపీలోనే చేరతాను. నా ప్రజలకు సేవ చేస్తాను” అంటూ చెప్పుకొచ్చారు. పవన్ కుమార్ ఈ ఇంటర్వ్యూలో మరిన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. పూర్తి ఇంటర్వ్యూని ఈ కింది వీడియోలో చూడండి.