రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో స్కూల్ హాస్టల్ లో కనీస సౌకర్యాలు లేక విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీళ్లు, ఇతర సౌకర్యాలు లేవని విద్యార్థినులు ఆందోళన బాట చేపట్టారు. చదువు తప్పితే మిగతా అన్ని విషయాల్లో ఈ కాలేజ్ లో సమస్యలు ఉన్నాయని అంటున్నారు. ఫుడ్ కూడా వేస్ట్ వాటర్ తో వండుతున్నారని, పురుగుల అన్నం, నీళ్ల చారుతో భోజనం పెడుతున్నారని మండిపడుతున్నారు. శుభ్రత పాటించడం లేదని, తాగడానికి మంచి నీరు అందుబాటులో ఉండడం లేదని అంటున్నారు. ప్లేట్లు కడగడానికి నీళ్లు లేక అందరం ఒకటే ప్లేటులో తినాల్సి వచ్చిందని, ఇలా ఎన్ని రోజులు బాధపడాలని ఆవేదన చెందుతున్నారు. నీళ్ల ట్యాంకర్లు కూడా డబ్బులు చెల్లించడం లేదని నీళ్లు పోయడం మానేశారని వాపోతున్నారు.
ఈ కాలేజ్ లో మొదటి నుంచి అనేక సమస్యలు ఉన్నాయని, ఎవరూ తమ సమస్యలని పట్టించుకోవడం లేదని అంటున్నారు. పీరియడ్స్ ఉన్న అమ్మాయిలకి ప్యాడ్స్ మార్చుకోవడానికి నీళ్లు కూడా లేని దుస్థితి నెలకొందని ఆవేదన చెందుతున్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం విద్యార్థినులు రోడ్లెక్కడంతో ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. సంక్షేమ హాస్టల్స్ నడిపే తీరు ఇదేనా? కనీస వసతులు లేక విద్యార్థినులు ఎంత నరకం అనుభవిస్తున్నారో చూడండి అంటూ మండిపడుతున్నారు. మరి నీటి సదుపాయం లేక ఇబ్బందులు పడుతున్న కస్తూర్బా గాంధీ విద్యార్థినులపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.