ఇటీవల కాలంలో ఎంతో మంది యువకులు బెట్టింగ్ లకు బానిసలుగా మారిపోతున్నారు. ఈ క్రమంలోనే ఇంట్లో చెప్పకుండా అప్పులు చేసి మరీ బెట్టింగ్ లో పెడుతున్నారు. చివరకు బెట్టింగ్ లో భారీగా డబ్బులు కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
ఐపీఎల్ క్రికెట్ లీగ్ ప్రారంభమైదంటే చాలు ప్రేక్షకులందరికీ కూడా అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరు ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ లను చూసి తెగ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే.. మరోవైపు బెట్టింగ్ మాఫియా కూడా రెచ్చి పోతూ ఉంటుంది. ముఖ్యంగా యువతను టార్గెట్ చేసుకుంటూ ఇక బెట్టింగ్ రాయుళ్లు రెచ్చి పోతూ ఉంటారు. ఇంకా ఈ బెట్టింగ్ కారణంగా ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ తాజాగా రంగారెడ్డి జిల్లాలో ఓ యువకుడి ప్రాణం తీసింది.
రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండలం గిరాయి గుట్ట గ్రామ పంచాయతీకి చెందిన ప్రకాశ్ అనే యువకుడు ఐపీఎల్ క్రికెట్ ను తెగ చూసేవాడు. అంతేకాక ఐపీఎల్ క్ క్రికెట్ లో బెట్టింగ్ లు కూడా పెట్టే వాడు. ఈ క్రమంలో ఇటీవల ప్రారంభమైన ఐపీఎల్ క్రికెట్ లో ప్రకాశ్ బెట్టింగ్ పెట్టి.. భారీగా డబ్బులు కోల్పోయాడు. దీంతో డబ్బులు ఇవ్వాలని బెట్టింగ్ మాఫియా ప్రకాశ్ ను తీవ్రంగా ఒత్తిడికి గురిచేసింది. దీంతో వారికి డబ్బులు ఇవ్వలేక, వారి వేధింపులు తట్టుకోలేక తీవ్ర మానసిక వేదనకు గురయ్యాడు. చివరకు బెట్టింగ్ మాఫియాకు డబ్బులు ఇవ్వలేక ప్రకాశ్ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గత ఐపీఎల్ మ్యాచ్ లో ప్రకాశ్ భారీగా బెట్టింగ్ పెట్టాడు. భారీగా డబ్బులు వస్తాయని ఆశ చూపి ఎంతోమందిని బెట్టింగ్ లోకి దింపి చివరికి అప్పుల పాలు చేస్తుంటారు.
అంతేకాక డబ్బులు చెల్లించాలంటూ వేధింపులకు గురిచేసి బలవన్మరణాలకు పాల్పడే పరిస్థితి తీసుకు వస్తూ ఉంటారు. ఇటీవల కాలంలో ఎంతో మంది యువకులు బెట్టింగ్ లకు బానిసలుగా మారిపోతున్నారు. ఈ క్రమంలోనే ఇంట్లో చెప్పకుండా అప్పులు చేసి మరీ బెట్టింగ్ లో పెడుతున్నారు. చివరకు బెట్టింగ్ లో భారీగా డబ్బులు కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లాలో బెట్టింగ్ పెట్టడం ప్రకాశ్ అనే యువకుడి ప్రాణం పోవడానికి కారణం అయ్యింది. మరి.. ఇలా బెట్టింగ్ ఊబిలో యువత చిక్కుకోకుండా నివారణ చర్యలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.