హైదరాబాద్ శివారులో 2 బీహెచ్‌కే ఇండ్ల స్థలం పది లక్షలకే దొరుకుతుంది. గజం రూ. పది వేలకే సొంతం చేసుకోవచ్చు. పూర్తిగా ప్రభుత్వ భూమి, ఎలాంటి చిక్కులు లేని భూమి. పైగా సదుపాయాలు, సౌకర్యాలు ఉన్నటువంటి ఏరియాలు అవి.
ఈ భూమ్మీద పెట్టుబడి పెట్టదగ్గ ఉత్తమమైన వస్తువు ఏదైనా ఉంది అంటే అది భూమి మాత్రమే. ఈ మొత్తం భూమిలో ఇసుక రేణువంత భూమి కొన్నా ఆ మనిషి కోటీశ్వరుడితో సమానం. అందుకే భూమ్మీద పెట్టుబడి పెడుతుంటారు. ఎటువంటి చిక్కులు లేని ఓపెన్ ప్లాట్లను తెలంగాణ ప్రభుత్వం అందిస్తుంది. ఈ ప్లాట్లను సొంతం చేసుకునే అరుదైన అవకాశాన్ని కల్పిస్తుంది. మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాలోని బాచుపల్లి, ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్), మేడిపల్లి లేఅవుట్ ల సమీపంలో 218 ఓపెన్ ప్లాట్లను ఈ-వేలంలో ఉంచుతుంది. మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాలోని బాచుపల్లి సమీపంలో 133 ప్లాట్లు, మేడిపల్లి సమీపంలో 85 ఓపెన్ ప్లాట్లను ఈ-వేలంలో ఉంచింది. బాచుపల్లి ప్లాట్లకు చదరపు గజానికి రూ. 25 వేలు కాగా, మేడిపల్లి ప్లాట్లకు చదరపు గజానికి రూ. 32 వేలుగా హెచ్ఎండీఏ నిర్ణయించింది.
265 నుంచి 576 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న వివిధ ప్లాట్ల ఈ-వేలం మే 22, 23, 24 తేదీల్లో జరుగుతుంది. కనీస వేలం పెంపుదల రూ. 500గా నిర్ణయించింది. ఒక్కో ప్లాటుకి ధరావత్తు సొమ్ము రూ. లక్ష రూపాయలు చెల్లించాలని ప్రకటించింది. మేడిపల్లి ప్లాట్లకు సంబంధించి ఈ-వేలం మే 24, 25వ తేదీల్లో మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకూ జరగనుంది. రిజిస్ట్రేషన్ కి, ధరావత్తు సొమ్ము చెల్లింపునకు ఆఖరు తేదీలు మే 22, 23. మేడిపల్లిలో ఉన్న 85 ప్లాట్లు 230 నుంచి 643 చదరపు గజాల విస్తీర్ణంలో ఉంటాయి. ఇక్కడ చదరపు గజం రూ. 32 వేలు. అలానే మన్నెగూడ, మునగనూరు, కవాడిపల్లి, చందానగర్ ఏరియాల్లో ప్లాట్లను వేలంలో ఉంచనున్నారు.
రంగారెడ్డి జిల్లా యంత్రాంగం, తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ, హెచ్ఎండీఏ సహకారంతో.. మన్నెగూడ, మునగనూరు, కవాడిపల్లి, చందానగర్ లోని 373 నివాస స్థలాలకు సంబందించిన ఈ-వేలం జూన్ 12 నుండి 21 వరకూ చేపట్టనుంది. మన్నెగూడలో గజం కనీస ధర రూ. 30 వేలుగా నిర్ణయించగా 166 ప్లాట్లను వేలంలో ఉంచనున్నారు. మునగనూరులో గజం కనీస ధర రూ. 20 వేలుగా నిర్ణయించగా 152 ప్లాట్లు ఉన్నాయి. కవాడిపల్లిలో గజం కనీస ధర రూ. 10 వేలు చొప్పున 52 ప్లాట్లను, చందానగర్ లో గజం కనీస ధర రూ. 40 వేలు చొప్పున 3 ప్లాట్లను వేలంలో ఉంచనున్నారు. ఈ వేలం ద్వారా రూ. 450 కోట్ల నుంచి రూ. 500 కోట్ల ఆదాయం రానుంది. మరోవైపు రంగారెడ్డి జిల్లాలోని షాబాద్, మోకిలలో మరో ఈ-వేలం నిర్వహించాలని హెచ్ఎండీఏ భావిస్తోంది.
దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ను త్వరలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్లాట్లను వేలం వేసే బాధ్యతను భారత ప్రభుత్వ సంస్థ ఎంఎస్టీసీ లిమిటెడ్ కి హెచ్ఎండీఏ అప్పగించింది. ప్రతి ప్లాట్ కి ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ రూ. 50 వేల నుంచి రూ. 3 లక్షల వరకూ ఉంటుంది. సంబంధించిన ప్రీబిడ్ సమావేశాలు జూన్ 2 నుంచి 9 వరకూ జరగనున్నాయి. వేలం కింద ఉన్న ప్లాట్లు తక్షణ నిర్మాణానికి సిద్ధంగా ఉన్నాయని హెచ్ఎండీఏ తెలిపింది. ఎలాంటి చిక్కులు, వివాదాలు లేని స్థలాలను వేలంలో ఉంచుతుంది. రోడ్ కనెక్టివిటీ, ప్రాథమిక సౌకర్యాలు కలిగి ఉన్న 100 శాతం స్పష్టమైన హామీ ఉన్న ప్రభుత్వ స్థలాలని అధికారులు చెబుతున్నారు. వేలంలో విక్రయించబడని ప్లాట్లను అవసరాన్ని బట్టి 2 బీహెచ్కే గృహాలు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం కోసం వినియోగిస్తామని అన్నారు.
హైదరాబాద్ లో స్థలం కొనాలంటే చదరపు అడుగుకి కనీసం రూ. 2 వేలు అయినా ఉంటుంది. అంటే చదరపు గజానికి రూ. 18 వేలు ఉంటుంది. ఇక గరిష్టంగా అంటే లక్షల్లో మాటే. కానీ శివారు ప్రాంతంలో హైదరాబాద్ లో చదరపు అడుగుకి పెట్టే డబ్బులతో చదరపు గజమే వస్తుంది. గజానికి రూ. 10 వేలు ఖర్చు పెడితే 2 బీహెచ్కే ఇండ్ల స్థలం వస్తుంది. పైగా హైదరాబాద్ లో ఉన్న ఏరియాల్లానే శివారు ప్రాంతాలు కూడా డెవలప్ అవుతున్నాయి. హైదరాబాద్ లోని కొన్ని ఏరియాలకు మాత్రమే కాకుండా అభివృద్ధిని మిగతా ఏరియాలకు విస్తరింపజేస్తున్నారు.
రిజిస్ట్రేషన్ ఫీజు: రూ. 1,180/-