వర్షమొస్తే చాయ్ కావాలి, బోర్ కొడితే చాయ్ కావాలి, తలనొప్పి వచ్చినా చాయ్ కావాలి, కొందరు బిర్యాని తిన్నాక మంచి ఇరానీ చాయ్ పడితే గానీ తృప్తి చెందరు. ఇంక హైదరాబాద్ మొత్తం చాయ్ లవర్స్ ఉంటారు అనడంలో సందేహం లేదు. పైగా అక్కడ స్పెషల్ ఇరానీ చాయ్ కూడా దొరుకుతుంది. ఎన్ని టెన్షన్స్ లో ఉన్నా ఒక్క ఇరానీ చాయ్ తాగితే అన్నీ మటుమాయం అయిపోతాయి. కానీ, ఇప్పుడు ఇరానీ చాయ్ తాగాలంటేనే టెన్షన్ పడాలేమో? ఈ వార్త చదివాక మీరూ అదే అనుకుంటారు. ఎందుకంటే ఇరానీ చాయ్ ధర పెరిగిపోయింది కాబట్టి.
ఇదీ చదవండి: అక్కడి ఆలయంలో దేవుడికి మద్యమే నైవేద్యం! అదే ప్రసాదం..
అవునండి పెట్రోల్, డీజిల్ ధరలే కాదు ఇప్పుడు ఇరానీ చాయ్ ధర కూడా పెరిగిపోయింది. ఇప్పటివరకు 15 రూపాయలగా ఉన్న కప్పు ఇరానీ చాయ్ ధర ఇక నుంచి రూ.5 పెరిగి కప్పుకు 20 రూపాయలు కానుంది. ఈ వార్త ఎంతో మంది హైదరాబాదీలను బాగా కలవర పెట్టి ఉండచ్చు. మరీ ఒకేసారి ఐదు రూపాయలు పెంచేశారా అని బాధ పడచ్చు. కానీ, వారికి ధర పెంచడం తప్ప మరో మార్గం లేదని వ్యాపారులు అంటున్నారు. ఎందుకంటే వారు ఇరానీ చాయ్ తయారీకి ఉపోయోగించే అన్ని వస్తువుల ధరలు పెరిగిపోయాయి కాబట్టి. మరో దారి లేదని తేల్చేశారు.
ఇరానీ చాయ్ తయారీకి ఉపయోగించే చాయ్ పత్తా కేజీ రూ.300 నుంచి రూ.500కు చేరింది. ఇరానీ చాయ్ తయారీకి నార్మల్ పాలు కాకుండా నాణ్యమైన పాలను ఉపయోగించాలి. అవి ఇప్పుడు దాదాపు రూ.100కు చేరుకున్నాయి. మరోవైపు వాణిజ్య సిలిండర్ ధర కూడా పెరిగిపోయింది. ఇరానీ చాయ్ తయారీలో ఎక్కడ రాజీ పడినా దానికి ఉండే ప్రత్యేక టేస్ట్ పోతుంది. కాబట్టి వాళ్లు ధర పెంచక తప్పడం లేదని చెబుతున్నారు. ఇరానీ చాయ్ ధర పెరగడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
A cup of Irani chai now costs ₹20 in some cafes now.
15₹ hue tab ich dil pe laga. Looks like I’ll have to cut down from 3 khara biscuits to 1 now.
— Yunus Lasania (@lasaniayunus) March 23, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.