Traffic Challans: కొంతమంది వాహనదారులు తమకు తెలియకుండానే ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తూ ఉంటారు. తర్వాత ఎప్పుడో గానీ, ట్రాఫిక్ చలాన్ల సైట్‌లోకి వెళ్లరు. అక్కడ ఫైన్లను చూసుకుని అవాక్కవుతుంటారు. ఇకపై ఇలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ట్రాఫిక్ రూల్ బ్రేక్ చేసిన వెంటనే మీకు ఆ విషయం తెలిసిపోయే విధంగా ట్రాఫిక్ పోలీసులు కొత్త విధానాన్ని మొదలుపెట్టబోతున్నారు. ట్రాఫిక్ చలాన్ల కోసం వాట్సాప్‌ను వాడబోతున్నారు. హైదరాబాద్‌లో ఉండే వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే అది వెంటనే వాట్సాప్ మెసేజ్ రూపంలో సంబంధిత వ‍్యక్తికి చేరుతుంది. ఎంత ఫైన్ కట్టాలన్న వివరాలు కూడా వెళతాయి. వాహనం కొనేటప్పుడు ఇచ్చిన మొబైల్ నెంబర్‌కు ఆ వివరాలను పంపనున్నారు. మొబైల్ వివరాలను ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ దగ్గరినుంచి సేకరించనున్నారు. ట్రాఫిక్ పోలీసులు నేరుగా కంట్రోల్ రూమ్‌నుంచి పోస్టల్ చలాన్లు, మెసేజ్‌లను పంపనున్నారు.
ఫైన్లను ఆన్‌లైన్ ద్వారా కానీ, మీసేవలో కానీ, కట్టాల్సి ఉంటుంది. ఒక వేళ వాహానాన్ని వేరే వ్యక్తికి అమ్మినట్లయితే.. కొన్న వారిపేరిట వాహన వివరాలు తప్పని సరిగా మార్చాల్సి ఉంటుంది. కాగా, పెండింగ్ చలాన్లను కట్టించటానికి ట్రాఫిక్ పోలీసులు ప్రతీ రోజు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. పెండింగ్ చలాన్లను కట్టించటానికి మార్చిలో ఓ డిస్కౌంట్‌ను కూడా ప్రకటించారు. ట్రాఫిక్ అధికారులు ఈ మేయిల్ ద్వారా కూడా చలాన్లు పంపాలని అధికారులు అనుకున్నారు. అయితే, అందరికీ ఈ మేయిల్ అకౌంట్లు ఉండవని భావించి ఆ ప్రయత్నాన్ని విరమించారు. మరి, ఇకపై నేరుగా వాట్సాప్‌కే ట్రాఫిక్ చలాన్ వివరాలు పంపటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : DJ టిల్లు పాటకి MLA జగ్గారెడ్డి మాస్ స్టెప్పులు..! వీడియో వైరల్