పూజారి.. భగవంతుడికి, భక్తుడికి మధ్య వారధి అంటారు. నిత్యం దైవసేవలో తరించే అర్చకుడు ఎంతో శాంతంగా, సహనంగా ఉండాలి. భక్తులు తెలిసి, తెలియక ఏదైనా పొరపాటు చేస్తే.. సరిదిద్దాలి. అంతేకానీ.. వారిమీద దౌర్జన్యం చేయకూడదు. అయితే ఇందుకు విరుద్ధమైన సంఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. గుడిలోని పూజారే ఓ వీధి రౌడీలాగా దౌర్జన్యం చేస్తూ భక్తులపై విరుచుకుపడిన సంఘటన సికింద్రాబాద్‌లో చోటు చేసుకుంది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉప్పల్‌లోని బాలాజీహిల్స్‌కి చెందిన వాల్మీకారావు అనే వ్యక్తి గత ఆదివారం రోజున రాత్రి 7 గంటలకు సికింద్రాబాద్ రైతిపైల్ బస్టాండ్‌కు ఆనుకోని ఉన్న గణేశుడి ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకున్నాడు.
అనంతరం పక్కనే ఉన్న చిన్న చిన్న గుడుల్లో దేవుళ్లను దర్శనం చేసుకుంటున్న క్రమంలో అక్కడ ఉన్న ప్రభాకర్ శర్మ అనే పూజారి ఒక్కసారిగా వాల్మీకారావుపై విరుచుకుపడ్డాడు. తన అనుమతి లేకుండా ఆలయంలోకి ఎందుకెళ్లావ్ అని బూతుపురాణం మొదలుపెట్టాడు. పూజారి వాలకం చూసి వాల్మీకారావుతో పాటు అక్కడి భక్తులు కూడా అవాక్కయ్యారు.
ఈ క్రమంలోనే ప్రభాకర్ శర్మ, వాల్మీకారావు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో రెచ్చిపోయిన పూజారి వాల్మీకారావుపై దాడి చేసి కింద పడేశాడు. ఎవరికీ చెప్పుకుంటావో చెప్పుకో పో అంటూ బెదిరించాడు. ఈ సంఘటన గత ఆదివారం జరగ్గా దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్ తాజాగా వెలుగులోకి వచ్చింది. పూజారి వ్యవహారంపై స్థానిక భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే బాధితుడు దీనిపై రాంగోపాల్‌పేట పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టాడు. పోలీసులు పూజారి ప్రభాకర్‌ను కస్టడీలోకి తీసుకోని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.