Hyderabad: పోలీసులు అప్పుడప్పుడు హీరోయిజాన్ని చూపిస్తుంటారు. ఎవరికైనా ఆపద వచ్చినప్పుడు సినిమాల్లో హీరో ఎలా అయితే వెంటనే రియాక్ట్ అవుతాడో అలా నిజ జీవితంలో కొంతమంది హీరోయిజాన్ని చూపిస్తుంటారు. ఈ మధ్య మన హైదరాబాద్ పోలీసులు కూడా సమాజంతో ఫ్రెండ్లీగా మూవ్ అవుతున్నారు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు పబ్లిక్ కి భద్రత గురించి సలహాలు, సూచనలు ఇస్తున్నారు. రియల్ లైఫ్ లో కూడా పబ్లిక్ పట్ల సానుకూలంగా వ్యవహరిస్తున్నారు. అక్కడక్కడా కొంతమంది దురుసుగా వ్యవహరించే పోలీసులు ఉండవచ్చు గాక. వారిని మినహాయిస్తే చాలా వరకూ పోలీసులు ఫ్రెండ్లీగానే వ్యవహరిస్తున్నారు. ఎవరికైనా ఏదైనా సహాయం అవసరమైతే ఆన్ ది స్పాట్ సాయం చేసి మానవత్వం చాటుకుంటున్నారు. తాము ఉన్నదే పబ్లిక్ కోసమని, తాము పబ్లిక్ సర్వెంట్స్ అని చేతల ద్వారా నిరూపిస్తున్నారు.
తాజాగా ఒక చిన్నారి విషయంలో సమయస్ఫూర్తిగా వ్యవహరించి ఆ చిన్నారి ప్రాణాలను కాపాడారు హైదరాబాద్ పోలీసులు. ఒక అంబులెన్స్ చిన్నారిని తీసుకుని లక్డీకపూల్ లో ఉన్న నిలోఫర్ ఆసుపత్రికి వెళ్తుంది. అయితే ఆ అంబులెన్స్ సైరన్ పనిచేయడం లేదు. అది గమనించిన హైదరాబాద్ పోలీసులు తమ వాహనాన్ని అంబులెన్స్ ముందు ఎస్కార్ట్ లా పోనిస్తూ.. ఆ అంబులెన్స్ ని నిలోఫర్ ఆసుపత్రి వరకూ తీసుకెళ్లి చిన్నారి ప్రాణాలను కాపాడారు. పోలీసులు చేసిన ఈ పనికి నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి అంబులెన్స్ కి ఎస్కార్ట్ లా పోలీసు వాహనాన్ని వాడి చిన్నారి ప్రాణాలను కాపాడిన మన హైదరాబాద్ పోలీసులపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి. సెల్యూట్ ఎమోజీతో మన పోలీసులను అభినందించండి.
ఇది కూడా చదవండి: బెంగళూరు వరదలపై KTR ట్వీట్.. మండిపడుతున్న నెటిజనులు!