నగరంలో డ్రగ్స్ కల్చర్ విపరీతంగా పెరుగుతోంది. ఈ మధ్య కాలంలో రాడిసన్ హోటల్ లో జరిగిన సంఘటనే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ. హోటల్ పై పోలీసులు రైడ్ చేస్తున్నారన్న సమాచారం ముందే తెలియడంతో.. పబ్ నిర్వాహకులు కొంతమేర అప్రమత్తమయ్యారు. ఈరైడ్ లో చాలా మంది ప్రముఖులకు చెందిన పిల్లలు పట్టుబడ్డ విషయం కూడా తెలిసిందే. ఈ ఘటనతో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. వీటి నిరోధంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. డ్రంకెన్ డ్రైవ్ టెస్టుల్లాగే డ్రగ్స్ టెస్టులు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.
డ్రంకన్ డ్రైవ్ టెస్టు గురుంచి అందరకి తెలుసు. నోట్లో బ్రీత్ అనలైజర్ పెట్టడం.. ఊదమనటం. పాయింట్లు ఎక్కువుగా వస్తే చర్యలు తీసుకోవటం. మరి డ్రగ్ టెస్ట్ ఎలా చేస్తారనేగా సందేహం. ఈ టెస్టు నిర్వహించేందుకు డ్రగ్ అనలైజర్లు వాడనున్నారు. లాలాజలంతో డ్రగ్ టెస్ట్ నిర్వహించనున్నారు. దీంతో 2 నిమిషాల్లోనే ఫలితం రానుంది. రిజల్ట్ పాజిటివ్గా వస్తే బ్లడ్, యూరిన్ శాంపిల్స్ సేకరించి నిర్థారించుకోనున్నారు. ఒకవేళ ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటే అనలైజర్లోని రెడ్ లైట్ బ్లింక్ అవుతుంది. గంజాయి, హాష్ ఆయిల్, కొకైన్, హెరాయిన్లను ఈ డ్రగ్ అనలైజర్లు గుర్తిస్తాయి. లా అండ్ ఆర్డర్, టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ డ్రగ్ పరీక్షలు నిర్వహించనున్నారు.
ఇది కూడా చదవండి: ఇంట్లో నుంచి వెళ్లగొట్టిన అత్తమామలు.. భర్త కోసం భార్య పోరాటం!