హైదరాబాద్ నగరానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రవక్తను కించపర్చేలా వ్యాఖ్యలు చేశారని.. వెంటనే ఆయన్ని అరెస్టు చేయాలని డిమాండు చేస్తూ.. పోలీసు కమీషనర్ ఆఫీసుతో పాటు ఇతర ప్రదేశాల్లో ముస్లింగ్ వర్గాల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అయ్యాయి.. రాజాసింగ్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
ఇక మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు గాను బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఆయను ఇంటి వద్దే పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మద్య హైదరాబాద్‌లో కమీడియన్ మునావర్ ఫారూకి షో జరిగిన విషయం తెలిసిందే. దీన్ని వ్యతిరేకిస్తూ వస్తున్న రాజాసింగ్ దానిపై ఒక వీడియో రిలీజ్ చేశారు. అది ముస్లింల మనోభావాలు దెబ్బదినేలా ఉన్నాయని ఆరోపణలు రావడంతో పోలీసుల విజ్ఞప్తితో రాజా సింగ్ వీడియోను యూట్యూబ్ నుంచి తొలగించారు. మరోవైపు రాజాసింగ్ అరెస్ట్ పై పలువురు బీజేపీ నేతలు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.