గత కొంతకాలం నుంచి తెలంగాణలో పేపర్ల లీకేజ్ వ్యవహారం హాట్ హాట్ గా ఉంది. ఇప్పటికీ టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ల లీకేజ్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆకేసు విచారణ సాగుతున్న సమయంలోనే టెన్త్ ఎగ్జామ్స్ లో ప్రశ్నపత్రాల లీకేజ్ జరిగింది. వరుసగా తెలుగు, హిందీ పరీక్షల ప్రశ్నపత్రాలు లీకయ్యాయి. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటు డిబార్ అయిన విద్యార్థికి కోర్టులో ఊరట లభించింది.
గత కొంతకాలం నుంచి తెలంగాణలో పేపర్ల లీకేజ్ వ్యవహారం హాట్ హాట్ గా ఉంది. ఇప్పటికీ టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ల లీకేజ్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆకేసు విచారణ సాగుతున్న సమయంలోనే టెన్త్ ఎగ్జామ్స్ లో ప్రశ్నపత్రాల లీకేజ్ జరిగింది. వరుసగా తెలుగు, హిందీ పరీక్షల ప్రశ్నపత్రాలు లీకయ్యాయి. పరీక్షలు ప్రారంభమైన క్షణాల్లోనే ప్రశ్నపత్రాలు వాట్సాప్ గ్రూప్ ప్రత్యక్షమయ్యాయి. ఈ పేపర్ల లీకేజ్ ఘటనలో కొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అలానే హిందీ పేపర్ లీకేజ్ ఆరోపణలో హరీష్ అనే విద్యార్థిని అధికారులు డిబార్ చేశారు. అయితే అతడికి తాజాగా హైకోర్టులో ఊరట లభించింది.
తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి తెలుగు, హిందీ ప్రశ్నపత్రాలు వాట్సాప్ గ్రూప్ లో బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. పరీక్ష మొదలైన కొద్ది నిమిషాల్లోనే ప్రశ్నపత్రాలు బయటకు రావడంతో విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చెందారు. అయితే వికారాబాద్ లో తెలుగు పేపర్ లీక్ కాగా.. హన్మకొండ జిల్లా కమలాపూర్ లో హిందీ పేపర్ లీక్ అయింది. అయితే ఈ ఘటనలపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అలానే హిందీ పేపర్ లీక్ చేసిన ఆరోపణలతో అధికారులు హరీష్ అనే విద్యార్థిని డిబార్ చేశారు. దీంతో ఆ విద్యార్థి తండ్రి హైకోర్టును ఆశ్రయించి.. హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
తన కొడుకు హరీష్ హిందీ పరీక్ష రాస్తున్న సమయంలో ఎవరో బలవంతంగా పేపర్ లాక్కున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు. అలానే కమలాపూర్ లో నమోదైన ఎఫ్ఐఆర్ లో కూడా ఎక్కడ తమ కుమారుడి పేరులోని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయినప్పటికీ శుక్రవారం నాటి పరీక్షను రాసేందుకు అధికారులు అనుమంతించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలకు తన కొడుకును బలి చేశారని ఆవేదన వ్యక్తం చేస్తూ హరీష్‌ను పరీక్షలు రాసేలా అనుమతి ఇవ్వాలని కోర్టును కోరారు. దీనిపై శనివారం విచారణ చేపట్టిన హైకోర్టు ఆ విద్యార్థికి ఊరట ఇచ్చింది. విద్యార్థిని మిగతా పరీక్షలు రాసేలా అనుమతివ్వాలని అధికారులను కోర్టు ఆదేశించింది.