లంగాణలో పదో తరగతి పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం అప్పట్లో సంచలనంగా మారింది. హన్మకొండలో హిందీ ప్రశ్నపత్రంలో హరీష్ అనే విద్యార్థి పేరు బయటకు వచ్చింది. తాజాగా అతడి ఫలితాల విషయంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
గత కొంతకాలం నుంచి తెలంగాణలో పేపర్ల లీకేజ్ వ్యవహారం హాట్ హాట్ గా ఉంది. ఇప్పటికీ టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ల లీకేజ్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆకేసు విచారణ సాగుతున్న సమయంలోనే టెన్త్ ఎగ్జామ్స్ లో ప్రశ్నపత్రాల లీకేజ్ జరిగింది. వరుసగా తెలుగు, హిందీ పరీక్షల ప్రశ్నపత్రాలు లీకయ్యాయి. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటు డిబార్ అయిన విద్యార్థికి కోర్టులో ఊరట లభించింది.
పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో అరెస్ట్ అయిన బండి సంజయ్ ఇవాళ బెయిల్ మీద విడుదలయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తన అరెస్ట్ విషయంలో కొన్ని పాయింట్లను లేవనెత్తారు.
తెలంగాణలో పదో తరగతి ప్రశ్నా పత్రం లీక్ ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ కేసులో బండి సంజయ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఆ వివరాలు..
పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ వ్యవహారంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాత్ర ఉందని తేల్చిన పోలీసులు.. అతనిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది.పేపర్ లీకేజ్‌కు తావులేకుండా ఉండేందుకు కఠిన చర్యలు చేపడుతోంది.
పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో బండి సంజయ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు.. కొద్దిసేపటి క్రితమే హనుమకొండ మెజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ కేసుపై కాసేపట్లో విచారణ జరగనుంది. కోర్టు సంజయ్ కు బెయిల్ ఇస్తుందా ? రిమాండ్ విధిస్తుందా అన్నది ఉత్కంఠగా మారింది. ఇదిలావుంటే బండి సంజయ్ ఒంటిపై గాయాలున్నట్లు సమాచారం అందుతోంది.
10వ తరగతి ప్రశ్నా పత్రం లీక్ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హస్తం ఉందని పోలీసులు భావించారు. ఈ నేపథ్యంలోనే ఆయన్ని మంగళవారం అర్థరాత్రి అదుపులోకి తీసుకున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో పేపర్ లీక్ కేసు ఎంత సంచలనం సృష్టిస్తుందో.. ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మొన్నటి వరకు టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ సంచలనం సృష్టించగా.. తాజాగా పదో తరగతి పేపర్లు లీక్ అవ్వడం సంచలనంగా మారింది. తాజాగా ఈ కేసులో బండి సంజయ్‌ను అరెస్ట్ చేశారు. ఆ వివరాలు..