60 ఏళ్ల వయసులో టెన్త్ పాస్ అయ్యాడు. వినటానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. ఇటీవల వెలువడిన 10వ తరగతి ఫలితాల్లో అతను ఉత్తీర్ణత సాధించారు.
ఏదైనా సాధించాలనే ఆసక్తి ఉండాలనే తప్పా.. దానికి వయసుతో సంబంధమే లేదని ఇప్పటికీ ఎంతోమంది నిరూపించారు. అయితే, ప్రతిభకు వయసుతో సంబంధం లేదని మరోసారి రుజువు చేశాడో వ్యక్తి. 60 ఏళ్ల వయసులో పదవ తరగతి పాస్ అయి అందరి దృష్టిని ఆకర్శించాడు. చిన్నప్పటి నుంచి చదువుకోవాలనే ఆసక్తి ఉన్నా.. ఇంటి ఆర్థిక పరిస్థితులు అతనికి చదువును దూరం చేశాయి. అయితే, అతను అన్నీ అధిగమించి ఇప్పుడు 60 ఏళ్ల వయసులోనూ పరీక్ష రాసి టెన్త్ పాస్ అయ్యాడు.
పైన ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు కెతావత్ కన్నిరాం. వయసు 60 ఏళ్లు. నిజామాబాద్ జిల్లా మల్లారం గ్రామానికి చెందిన ఇతనికి చిన్న ప్పటి నుంచి చదువుకోవాలని ఎంతో ఆసక్తి ఉండేది. కానీ, ఇంటి ఆర్థిక పరిస్థితుల వల్ల అతను చదువుకోలేకపోయాడు. ఆ తర్వాత పెళ్లై పిల్లలు కూడా జన్మించారు. కానీ, అతనికి చదువుకోవాలనే ఆశ మాత్రం చావలేదు. దీంతో ఎలాగైన చదువుకోవాలని భావించి కన్నిరాం ఈ ఏడాది రుద్రూరు స్కూల్ లో ఓపెన్ టెన్త్ చదివాడు. గతంలో పరీక్షలు కూడా రాశాడు. ఇక ఇటీవల వెలువడిన ఫలితాల్లో కన్నిరాం టెన్త్ పరీక్షలు పాస్ అయ్యాడు. దీంతో ఇతడిని చూసి అందరూ ఆదర్శంగా తీసుకుంటున్నారు. మరో విషయం ఏంటంటే? అతడు ప్రస్తుతం గ్రామ సర్పంచ్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న చాలా మంది అతనికి కంగ్రాట్యూలేషన్ చెబుతున్నారు.