తండ్రి శవం ముందు రాత్రంతా ఏడ్చిన బాలుని ఘటన అందరినీ కలిచివేస్తుంది. అభం శుభం తెలియని మూడేళ్ల పసివాడు కారు చీకట్లో అడవిలో ఒంటరిగా ఏడుస్తూ గడిపిన హృదయ విదారకమైన ఘటన వెలుగులోకి వచ్చింది.
ఈ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదాలు విపరీతంగా జరుగుతున్నాయి. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ, అతివేగంతో వాహనాలను నడుపుకుంటూ ప్రమాదాలకు గురవుతున్నారు. వాహనదారులకు ట్రాఫిక్ సిబ్బంది ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తున్నా కూడా అవి పాటించకుండ నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఎన్ని అవగాహనా కార్యక్రమాలు పెట్టినా రోజురోజుకు ప్రమాదంలో చనిపోయేవారి సంఖ్య పెరుగుతుంది. పేరెంట్స్ చనిపోయిన పిల్లల జీవితం అగమ్యగోచరం అవుతుంది. వారి ఆలనాపాలనా చూసేవారు లేక చాలా ఇబ్బుందులకు గురవుతున్నారు. కళ్ల ముందే పేరెంట్స్ ప్రమాదానికి గురైనపుడు వారిని రక్షించుకునే ప్రయత్నం చేస్తాం. కానీ ఇది ప్రమాదం అని కూడ పసిగట్టలేని చిన్న వయస్సులో తండ్రి చనిపోయిన బాలుడు రాంత్రంతా ఏడ్చి.. ఏడ్చి..నిద్రపోయిన ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అసలు ఏం జరిగిందో పూర్తి వివరాల్లోకి వెళితే..
నిజామాబాద్ జిల్లోని ఇందల్ వాయి మండలం వెంగల్‌పాడు గ్రామంలో మాలవత్ రెడ్డి అనే వ్యక్తి నివాసముంటున్నాడు. ఆయనకు మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. తన కొడుకును తీసుకుని బైక్ పై కామారెడ్డి జిల్లా యాచారం వెళ్లాడు. ఆ తర్వాత రాత్రి బంధువుల ఇంటి నుండి తిరిగి వస్తున్న క్రమంలో సదాశివనగర్ మండలం దగ్గి అడవి ప్రాంతంలో జాతీయ రహదారిపై బైక్ ప్రమాదం చోటు చేసుకుంది. బారీకేడ్‌ను బైక్ ఢీ కొట్టడంతో ప్రమాదం నెలకొంది. దీంతో తండ్రి కొడుకులు ఎగిరి కిందపడ్డారు. తండ్రికి తీవ్రగాయాలు తగలడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. కొడుకు మాత్రం సురక్షితంగా బయటపడ్డాడు. తండ్రి ఎంతకూ లేవకపోవడంతో ఏడ్చి.. ఏడ్చి.. తండ్రి పక్కనే బాలుడు నిద్రపోయాడు.
ఘటనా స్థలం అడవి ప్రాంతం కావడంతో ఉదయం వరకు అటువైపు ఎవరు రాలేదు. తర్వాత రోజు ఉదయాన్నే దగ్గరలో ఉన్న గుడి పూజారి చూసి పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు. తండ్రి శవం ముందు రాత్రంతా ఏడ్చిన బాలుని ఘటన అందరినీ కలిచివేస్తుంది. అభం శుభం తెలియని మూడేళ్ల పసివాడు కారు చీకట్లో అడవిలో ఒంటరిగా ఏడుస్తూ గడిపిన హృదయ విదారకమైన ఘటన వెలుగులోకి వచ్చింది.