ప్రస్తుత సమాజంలో అక్రమ సంబంధాలు ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నాయి. చక్కగా పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండే కుటుంబాల సంఖ్య రోజు రోజుకీ తగ్గిపోతున్నాయి. తాజాగా అలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది.
ప్రస్తుత సమాజంలో అక్రమ సంబంధాలు ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నాయి. చక్కగా పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండే కుటుంబాల సంఖ్య రోజు రోజుకీ తగ్గిపోతున్నాయి. దానికి ప్రధాన కారణం ఇతరులతో అక్రమ సంబంధమే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని జంటలు విడాకులు తీసుకొని ఈ సమస్యను పరిష్కరించుకుంటే.. మరి కొందరు మాత్రం చేసేదేమి లేక వారిలో వారు కృంగిపోతారు. ఇక చాలా అరుదుగా మనస్తాపానికి గురై, తమ బాధను ఎవరితో చెప్పుకోలేక చనిపోవడానికి సిద్ధమైపోతారు. తాజాగా అలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది. భర్త అక్రమ సంబంధం భరించలేని భార్య ఆత్మహత్యకు పాల్పడింది. ఇక పూర్తి వివరాల్లోకెళ్తే..
అతని పేరు మనోజ్. అరుణ, ఎర్ర మహేష్ వీరి తల్లిదండ్రులు. నవీ పేటలో వీరు నివాసముంటున్నారు. 2020 లో మనోజ్ నిజామాబాద్ కి చెందిన కావ్య రశ్రీ తో వివాహం జరిగింది. ఈమె తండ్రి రాజేందర్. నవీన్ ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి. ఇక వివాహం తర్వాత భర్త మనోజ్ మరొక స్త్రీ తో అక్రమ సంబంధానికి పెట్టుకున్నాడు. ఆ మైకంలో పడి తన భార్య కావ్యని పూర్తిగా మరిచిపోయాడు.దీంతో కావ్య భర్తను ప్రశ్నించడం మొదలుపెట్టింది. భార్యకి సమాధానం చెప్పలేక మనోజ్ ఆమెని హింసలు పెడుతూ వచ్చాడు. దీంతో మానసికంగా కృంగిపోయిన కావ్యశ్రీ.. ఈ విషయాన్ని ఊరిలో పెద్దల దృష్టికి తీసుకెళ్లింది. అయితే పెద్దలు వారిద్దరికీ సర్ది చెప్పి పంపించేశారు.
పెద్దలు నచ్చజెప్పినప్పటికీ మనోజ్ మాత్రం తన తీరు మార్చుకోలేదు. ఓ వైపు అక్రమ సంబంధం కొనసాగిస్తూనే మరో వైపు భార్యను చిత్రహింసలు చేస్తున్నాడు. మనోజ్ కి అప్పులు కూడా ఎక్కువగా ఉండడంతో ఆమెను వరకట్నం పేరుతో మరింతగా వేధించాడు. అత్త మామలతో ఈ విషయాన్ని చెప్పుకున్న వారు కూడా ఆమెను టార్చర్ చేయడంతో కావ్యశ్రీ తట్టుకోలేకపోయింది. ఇంట్లోని ఫ్యాన్ కి ఉరేసుకొని చనిపోయింది. ఈ విషయం తెలుసుకున్న కావ్యశ్రీ తండ్రి రాజేందర్ తన కూతురిని వరకట్నం వేధింపులతో అన్యాయంగా చంపేశారని పోలీసులకి కంప్లైంట్ ఇచ్చాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న నిజామాబాద్ ACP కిరణ్ కుమార్ ఘటన స్థలానికి వచ్చి మృత దేహాన్ని పరిశీలించారు. ఆమె భర్త మనోజ్ తో పాటు తల్లిదండ్రుల మీద కూడా కేసు నమోదు చేయమని చెప్పగా పోలీసులు కేసు నమోదు చేశారు.