ఇటీవల తెలంగాణలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో అద్భుతమైన మౌళిక సదుపాయాలు కల్పిస్తున్నామని ప్రభుత్వం చెబుతుంది. కానీ కొన్ని చోట్ల మాత్రం వైద్య సిబ్బంది నిర్లక్ష్యం, వసతుల లేమి కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. దీంతో రోగులు ప్రభుత్వ ఆసుపత్రులకు రావాలంటేనే భయపడుతున్నారు.
ఇటీలవ కాలంలో పలు ప్రభుత్వాసుపత్రుల్లో పర్యవేక్షణ మచ్చుకైనా కనిపించకుండా పోతుందని.. రోగులు వస్తే కనీసం తమని పట్టించుకునే వారు కరువైయ్యారని.. సరైన వసతులు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారని పలు ఆరోపణలు వస్తున్నాయి. ఇందుకు తగ్గట్టుగానే పలు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్వాకాలు బయట పడుతున్నాయి. తాజాగా నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రిలో దారుణం జరిగింది. ఆసుపత్రిలో వసతుల లేమి, సిబ్బంది నిర్లక్ష్యం బయట పడింది. రోగిని తీసుకు వెళ్లేందుకు కనీసం స్ట్రెచర్ కానీ, వీల్ చైర్ కానీ అందుబాటులో లేకపోవడంతో తల్లిదండ్రులు పేషెంట్ కాళ్లు పట్టుకొని లాక్కెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తాజాగా ఈ ఘటనపై ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే..
తెలంగాణలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎన్నో మెరుగైన సేవలు అందిస్తున్నామని సర్కార్ చెబుతుంది. కానీ కొన్నిచోట్ల వసతుల లేమి.. సిబ్బంది నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అలాంటి నిర్లక్ష్యపు సంఘటన నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. హాస్పిటల్ లో సమయానికి వీల్ చేర్, స్ట్రెచర్ అందుబాటులో లేకపోవడంతో ఓ రోగి తల్లిదండ్రులు అతని కాళ్లు పట్టుకొని లాక్కెళ్లిన ఘటన తీవ్ర కలకలం రేపింది. అయితే ఈ ఘటనలో తమ తప్పు ఏం లేదని హాస్పిటల్ సిబ్బంది చెబుతుండటం విశేషం. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు స్పందించారు. నిజామాబాద్ ఘటనపై వెంటనే విచారణకు ఆదేశించారు. అసలు అక్కడ ఏం జరిగిందో పూర్తి వివరాలపై నివేధిక ఇవ్వాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ను ఆదేశించారు హరీష్ రావు. రీపోర్టు ఆధారంగా దోషులుగా ఎవరు తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు.
ఓ వైపు ప్రభుత్వ ఆసుపత్రులకు మాత్రమే రావాలి.. ఇక్కడ ఎన్నో మెరుగైన వసతులు.. సీనియర్ డాక్టర్లు అందుబాటులో ఉంటున్నారని తెలంగాణ సర్కార్ చెబుతుంది. కానీ.. ఇలాంటి పరిస్థితులు జరగడంతో ప్రభుత్వ ఆసుపత్రులకు రావాలంటేనే భయపడుతున్నారు బాధితులు. ఆసుపత్రుల్లో పర్యవేక్షించాల్సిన భద్రతా సిబ్బంది అలసత్వం.. నిర్లక్ష్యం వహిస్తున్నారు. కొన్ని చోట్ల సీసీ కెమెరాల నిఘా కూడా కరువైందని అంటున్నారు. తాజాగా నిజామాబాద్ ఘటనపై హాస్పిటల్ సూపరింటెండెంట్ ప్రతిమా రాజ్ మాట్లాడుతూ.. వీల్ చైర్ తెచ్చేలోపు లిఫ్ట్ రావడంతో రోగి తల్లిదండ్రులు అతన్ని కాళ్లు పట్టుకొని లాక్కెళ్లారని.. వెంటనే సిబ్బంది వెళ్లి వారిని వారించి వీల్ చైర్ లో తీసుకు వెళ్లారని అన్నారు. ఇది తెలియక ఎవరో వీడియో తీసి దాన్ని వైరల్ చేశారని అన్నారు.
At first I thought it may be from UP or Bihar & later I was shocked to know that This is from nizamabad government hospital #Telangana A patient son was being dragged by his parents due to lack of stretchers in the hospital how shameful it is sir ? @BRSHarish @KTRBRS #Nizamabad pic.twitter.com/ie4z55XA79
— Tharun Reddy (@KethireddyTarun) April 15, 2023