తెలంగాణం సర్కార్ రైతులకు మరో గుడ్ న్యూస్ అందించింది. ఆ రైతులకు ఈ నెల 12న ఎకరాకు రూ.10 వేల చొప్పున చెక్కులు అందించనున్నట్లు తెలిపింది.
తెలంగాణ ప్రభుత్వం రైతులకు మరో శుభవార్తను అందించింది. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా చాలా ఎకరాల్లో పంట నీటి మునిగింది. దీంతో పాటు కోసిన పంట కూడా వర్షానికి పూర్తిగా తడిసింది. దీనిపై స్పందించిన ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులను తప్పకుండా ఆదుకుంటామని ఇటీవల హామీ ఇచ్చింది. ఇక ఆ మాట ప్రకారం.. ప్రభుత్వం సాయం చేయడానికి ముందుకు వచ్చింది. నష్టపోయిన రైతుల సమాచారం సేకరణ కూడా పూర్తైంది. ఇక బాధిత రైతులకు ఎకరాకు రూ.10 వేల సాయం అందిస్తామని తెలుపుతూ ఇచ్చే తేదిని కూడా ప్రకటించింది.
ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా ఎంతో మంది రైతులు నష్టపోయారు. కురిసిన వడగండ్ల వానకు ఎన్నో ఎకరాల పంట పూర్తిగా నీట మునిగింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికి అందే లోపే పంట నీట మునగడంతో రైతులకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక దీనిపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకుంటామని సీఎం కేసీఆర్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అధికారులు నష్టపోయిన రైతుల వివరాలు సైతం సేకరించారు. ఇక ఇచ్చిన మాట ప్రకారమే.. బాధిత రైతులకు ఈ నెల12న ఎకరాకు రూ.10 వేల చొప్పున స్థానిక ఎమ్మెల్యేల ద్వారా రైతులు చెక్కుల పంపిణీ చేయనున్నట్లు తెలిపింది. ఈ వార్తతో నష్టపోయిన రైతులకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.