భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. భారీ ఎత్తున మంటలు చెలరేగడంతో ఓ షోరూంలో 50కి పైగా కార్లు దగ్ధమయ్యాయి.
భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంగళవారం రాత్రి హైదరాబాద్ లోని ఎల్బీనగర్ లో ఓ గోదాంలో మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో పక్కనే ఉన్న పాత కార్ల గ్యారేజీకి వ్యాపించాయి. టింబర్ డిపోలో చోటు చేసుకున్న ప్రమాదం కారణంగా ‘కార్ ఓ మ్యాన్’ గ్యారేజ్ లో ఉన్న 50కి పైగా కార్లు దగ్ధమయ్యాయి. భారీ శబ్దాలతో షోరూంలోని కార్లు తగలబడుతున్నాయి. కార్ల షోరూంలో ఉన్న గ్యాస్ సిలిండర్లు ఉండడంతో భారీగా పేలుళ్లు సంభవించాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు వ్యాపించాయి. మంటలు పక్కనే ఉన్న మల్టీప్లెక్స్, అపార్ట్మెంట్ లకు వ్యాపించాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. మంటలు తీవ్ర స్థాయిలో వ్యాపిస్తుండడంతో స్థానికులను అధికారులు ఇళ్ళు ఖాళీ చేయిస్తున్నారు. ప్రస్తుతం నాలుగు ఫైర్ ఇంజన్లు మంటలను అదుపు చేస్తున్నాయి. ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై వివరాలు తెలియాల్సి ఉంది.