మనం నిత్యం అనేక ఆశ్చర్యకరమైన ఘటనలు చూస్తూంటాము. ఆ సంఘటనలు కారణం దేవుడి మహిమ అన్నట్లు చాలా మంది భావిస్తారు. చావుల అంచుల దాకా వెళ్లిన వ్యక్తి పలనా దేవుడి మహిమతో బ్రతికాడని, అసలు అంతు చిక్కని వ్యాధితో బాధపడే వ్యక్తి.. పలాన దేవుడి మహిమతో ఆరోగ్యంగా ఉన్నాడని కొందర అంటుంటారు. అచ్చం అలాంటిదే ఓ ఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది. ప్రమాదంలో మాటలు కోల్పోయిన వ్యక్తి.. మూడేళ్ల తరువాత చకచకా మాట్లాడేస్తున్నాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కేశంపేటలోని వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో చోటుచేసుకుంది. దీంతో ఈ విషయం ఆనోటా ఈనోటా వ్యాపించింది. అయితే విషయం గురించి అసలు విషయం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
రంగారెడ్డి జిల్లా కేశంపేట గ్రామానికి చెందిన బ్రహ్మచారి.. మూడేళ్ల కిందట ప్రమాదవశాత్తు ఇంట్లో కిందపడిపోయాడు. దీంతో మెదడుకు బలమైన గాయం కావడంతో మాట కోల్పోయాడు. దీంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆపరేషన్ చేస్తే మాట వస్తుందని వైద్యులు తెలిపారు. ఆపరేషన్ కి రూ.3 లక్షలు అవుతాయని డాక్టర్లు తెలిపారు. అయితే అంత స్తోమత లేని ఆ కుటుంబ సభ్యులు బ్రహ్మచారిని అలాగే వదిలేశారు. ఇక అప్పటి నుంచి అతడు మూగతనంతో బాధపడుతున్నాడు. అలా మూడేళ్ల కాలం గడిచింది. ఇటీవల వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని నిర్వహించారు.స్థానికులతో కలిసి బ్రహ్మచారి కూడా వీరబ్రహ్మేంద్రస్వామి దీక్ష చేపట్టాడు. బ్రహ్మచారి కూడా ఆ దీక్ష చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం బ్రహ్మచారి ఆలయ గర్భగుడి శుభ్రం చేస్తుండగా ఒక్కసారి పూనకం వచ్చినట్లు ఊగిపోయాడు. కొంత సమయానికి మాట్లాడటం మొదలుపెట్టాడు. మొదట గర్భగుడిలో ఉంటే మాట్లాడటం.. బయటకు వస్తే మాటలు రాకపోవడాన్ని భక్తులు గమనించారు. దీంతో స్వామివారికి 11 బిందెలతో అభిషేకం చేయడంతో బ్రహ్మచారికి మాటలు పూర్తిగా రావడం మొదలైంది.
ఇదంతా ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి మహిమే అని స్థానికులు అంటున్నారు. ఈ ఘటనపై డిప్యూటీ డీఎంహెచ్‌ఓ దామోదర్ స్పందిస్తూ.. బ్రెయిన్‌కి గాయమైనప్పుడు మాటలు కోల్పోవడం జరుగుతుంటుందని, అయితే కొన్నిసార్లు గాయం దానికదే మాని చికిత్స అవసరం లేకుండానే మాటలు తిరిగొస్తాయని తెలిపారు. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.