అమెరికాలో భారతీయులకు రక్షణ కరువైంది. ఉన్నత విద్య కోసమని, విదేశీ ఉద్యోగం కోసమని వెళ్తున్న భారతీయులను అక్కడి గన్ కల్చర్ పొట్టన బెట్టుకుంటోంది. జాతి వివక్ష చూపించి కొందరు, సైకోల్లా ప్రవర్తిస్తూ మరికొందరు భారతీయుల ప్రాణాలను తీస్తున్నారు. తాజాగా ఒక సైకో జరిపిన కాల్పుల్లో తెలుగమ్మాయి, జడ్జి కూతురు మృతి చెందింది.
అమెరికాలో గన్ కల్చర్ మరీ దారుణంగా ఉంది. కాల్పులకు కేరాఫ్ అడ్రస్ గా అమెరికా మారిపోయింది. నిండా 18 ఏళ్ళు రాని వారు కూడా తుపాకులు పట్టుకుని తిరుగుతున్నారు. స్కూల్ విద్యార్థులు, కాలేజీ విద్యార్థులే లక్ష్యంగా కాల్పులకు పాల్పడుతున్నారు. నాలుగు రోజుల క్రితమే 8వ తరగతి చదువుతున్న బాలుడు తన టీచర్ పై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఆ తర్వాత తోటి విద్యార్థుల మీద, సెక్యూరిటీ గార్డు మీద కాల్పులు జరిపాడు. మగవాళ్లే కాదు మహిళలు కూడా ఈ గన్ కల్చర్ లో భాగస్వామ్యం ఉందని రుజువు చేస్తున్నారు. రెండు నెలల క్రితం ఒక మహిళ ప్రైవేట్ ఎలిమెంటరీ స్కూల్ లో ఆరుగురి మీద కాల్పులు జరిపింది. కాల్పుల్లో ముగ్గురు చిన్నారులు, ముగ్గురు స్కూల్ సిబ్బంది ఉన్నారు.
ఇలాంటి ఘటనలు జరగడం అమెరికాలో కొత్తేమీ కాదు. గత ఏడాది ఉవాల్డే స్కూల్లో కొంతమంది కాల్పులకు పాల్పడగా 19 మంది విద్యార్థులు, ఇద్దరు టీచర్లు మృతి చెందారు. ఈ గన్ కల్చర్ అనేది పెరుగుతూ వస్తుందే టాప్ తగ్గడం లేదు. తాజాగా అమెరికాలో జరిగిన కాల్పుల్లో తెలుగమ్మాయి మృతి చెందింది. టెక్సాస్ లోని డల్లాస్ కి ఉత్తరాన 25 కి.మీ. దూరంలో ఉన్న అలెన్ ప్రీమియర్ షాపింగ్ మాల్ లో ఓ దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటన శనివారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో 9 మంది దుర్మరణం చెందగా.. ఏడుగురికి గాయాలు అయ్యాయి. 9 మందిలో ఒకడు కాల్పులు జరిపిన దుండగుడు ఉన్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీస్ అధికారి ఆ దుండగుడ్ని కాల్చి చంపారు.
మరణించిన 8 మందిలో తెలుగమ్మాయి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. తెలంగాణకు చెందిన తాటికొండ ఐశ్యర్య (27) మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పాస్ పోర్ట్, వేలిముద్రల ఆధారంగా ఐశ్వర్య తండ్రి నర్సిరెడ్డి రంగారెడ్డి జిల్లా కోర్టులో జడ్జిగా పని చేస్తున్నారు. ఈమె తల్లి అరుణ. ఐశ్వర్య ‘పర్ఫెక్ట్ జనరల్ కాంట్రాక్టర్స్’ కంపెనీలో ప్రాజెక్టు మేనేజర్ గా పని చేసేది. రేపు ఐశ్వర్య మృతదేహాన్ని రెహమా ఫునెరల్ సెంటర్ కి తరలించనున్నట్లు సమాచారం. తానా ఆధ్వర్యంలో రేపు సాయంత్రం మృతదేహాన్ని తరలించనున్నట్లు తెలుస్తోంది. కాల్పులు జరిపిన వ్యక్తి ముఖానికి మాస్క్ పెట్టుకున్నాడని.. అయితే ఎందుకు కాల్పులు జరిపాడో అన్న విషయం తెలియలేదని పోలీసులు తెలిపారు. మరి అమెరికాలో పెరిగిపోతున్న గన్ కల్చర్ పై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.