దేశ వ్యాప్తంగా ఎంతో ఆనందంగా శ్రీరామ నవమి వేడుకలు జరుపుకుంటున్నారు. సుప్రసిద్ద ఆలయాలు మొత్తం భక్తులతో కిట కిటలాడుతున్నాయి. ఎక్కడ చైసినా జై శ్రీరామ్ అంటూ మారుమోగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్లు భారీ ఎత్తున శోభా యాత్రలు నిర్వహిస్తున్నారు. నవమి వేడుకల సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో పోలీస్ సెక్యూరిటీ పెంచారు.
ఈ రోజు దేశ వ్యాప్తంగా ఎంతో ఆనందంగా శ్రీరామ నవమి వేడుకలు జరుపుకుంటున్నారు. దేవాలయన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమైన ఆలయాల్లో నవమి వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. కొన్ని చోట్ల శోభా యాత్రలు నిర్వహిస్తున్నారు. నవమి వేడుకల సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో పోలీస్ సెక్యూరిటీ పెంచారు. తాజాగా శ్రీరామ నవమి రోజున యాదాద్రిలో అపచారం చోటు చేసుకుంది. తెలంగాణ పుణ్య క్షేత్రమైన యాదాద్రిలో డ్రోన్స్ కలకలం సృష్టించాయి. ఆలయ ప్రాంగణంలో డ్రోన్ ను చూసిన భక్తులు ఏదో జరుగుతుందని భయంతో పరుగులు తీశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
తెలుగు రాష్ట్రాల్లో నేడు శ్రీరామ నవమి వేడుకలు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు.. ఓ వైపు వేడుకలు జరుగుతుండగా యాదాద్రిలో రాములవారి కళ్యాణం జరుగుతుండగా.. మరోవైపు ఆయల ప్రాంగణంలో డ్రోన్స్ కలకం రేపాయి. స్వామి వారి కళ్యాణానికి వేలాదిగా భక్తులు తరలి వచ్చారు.. ఈ సమయంలో అనుమతి లేకుండా డ్రోన్స్ కెమరాలతో దేవాలయాన్ని చిత్రీకరిస్తున్న విషయాన్ని ఆలయ సిబ్బంది గమనించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు డ్రన్స్ ఆపరేట్ చేసిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. జీడిమెట్లకు చెందిన సాయికిరణ్, జాన్ లుగా పోలీసులు గుర్తించారు. ఎలాంటి పరిమిషన్ తీసుకోకుండా ఎందుకు డ్రోన్స్ ఆపరేట్ చేశార్న విషయం పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే శ్రీరామ నవమి వేడుక రోజే యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో ఇలా జరగడం అపచారం అని అంటున్నారు. ఆగమశాస్త్రాల ప్రకారం ఆలయ గోపరం పై విమానాలు మరే ఇతర విహంగాలు ఎగురకూడదు అనే నియమం ఉంది. అందుకే ఆలయ పరిసర ప్రాంతాల్లో విమానాలు, డ్రోన్ కెమెరాలను నిషేదించారు. ఈ నేపథ్యంలో డ్రన్స్ తో చిత్రీకరించడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇంత కట్టుదిట్టమైన పోలీస్ భద్రత ఉన్నా.. ఈ ఇద్దరు యువకులు ఎలా ఆపరేట్ చేశారు.. డ్రోన్ కెమెరాలను ఎందుకు ఉపయోగించారన్న విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు పోలీసుల భద్రతా వైఫల్యానికి ఇది నిదర్శనం అని కొంత మంది భక్తులు ఆరోపిస్తున్నారు. ఇకనైనా అధికారులు ఆలయ భద్రతపై దృష్టి పెడితే బాగుంటుందని సూచిస్తున్నారు. ఇలా డ్రోన్స్ ఉపయోగించడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.