ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కేసు పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడం కీలకంగా మారింది. నేడు కవిత ఈడీ ముందు విచారణకు హాజరు కానుంది. ఈ క్రమంలో ఓ ఆసక్తికర చర్చ సాగుతోంది. అది కూడా నంబర్ 11 గురించి.. ఏంటి అంటే..
ఢిల్లీ లిక్కర్ స్కామ్ తెలంగాణలోనే కాక.. దేశ రాజకీయాల్లో కూడా కాక రేపుతోంది. ఈ కేసులో ఈడీ దూకుడు పెంచింది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 11 న అనగా శనివారం ఈడీ విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు ఇచ్చింది. నేడు కవిత ఈడీ విచారణకు హాజరు కానుంది. ప్రస్తుతం కవిత మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం పోరాటం చేస్తూ.. ఢిల్లీలోనే ఉంది. నేడు కవిత ఈడీ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో.. బీఆర్‌ఎస్ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుతో కీలకమైన బీఆర్‌ఎస్ లీడర్లు, పార్టీ లీగల్ సెల్‌కు చెందిన న్యాయనిపుణులు ఢిల్లీ వెళ్లారు.
నేడు కవిత విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో.. ఓ ఆసక్తికర చర్చ తెర మీదకు వచ్చింది. కవితకు 11 నంబర్ అచ్చి రావడం లేదని అంటున్నారు జనాలు. అదేంటి 11 నంబర్‌తో కవితకు సంబంధం ఏంటంటే.. ఆసక్తికర సమాధానం చెబుతున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ తొలిసారి కవితను డిసెంబరులో విచారించారు. 2022, డిసెంబరు 11వ తేదీ ఉదయం 11 గంటలకు సీబీఐ ప్రత్యేక బృందం బంజారాహిల్స్‌లోని కవిత ఇంటిలో ఆమెను.. సుమారు ఏడున్నర గంటల పాటు విచారించి పలు ప్రశ్నలకు సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు. విచారణ తర్వాత సీబీఐ నమోదు చేసిన కేసు ఆధారంగా మనీలాండరింగ్ కోణంలో విచారణ చేపట్టిన ఈడీ తాజాగా కవితకు నోటీసులు జారీ చేసింది.
నోటీసులు నేపథ్యంలో కవిత ఢిల్లీలో ముందుగా అనుకున్న కార్యక్రమాలు ఉండడం వల్ల ముందు ఈ నెల 15వ తేదీన హాజరు అవుతానంటూ ఈడీకి లేఖ రాశారు. అయితే అధికారులు మాత్రం ఫిబ్రవరి 11వ తేదీన హజరవ్వాలని తెలపగా.. కవిత అందుకు ఓకే అన్నారు. ఈ నేపథ్యంలో నేడు అనగా ఫిబ్రవరి 11న.. సుమారు ఉదయం “11” గంటలకు ఈడీ ముందు కవిత హాజరుకానున్నారు. తర్వాత పరిణామాలు ఎలా ఊంటాయి అనేది ఆసక్తికరంగా మారింది. అంతేకాక ఈ కేసులో కవితను దర్యాప్తు సంస్థలు సెలవు దినాల్లోనే విచారిస్తున్నాయి. డిసెంబరు 11న ఆదివారం కాగా.. మార్చి 11న రెండో శనివారం కావడం గమనార్హం.
కవిత విచారణ నేపథ్యంలో మరో ఏడుగురికి ఈడీ శనివారం నోటీసులు ఇచ్చింది. పీఎంఎల్‌ఏ సెక్షన్ 50/2 కింద అధికారులు నోటీస్ ఇచ్చారు. అయితే.. ఇప్పటివరకు మొత్తం “11” మందికి ఇదే సెక్షన్ కింద నోటీసు ఇవ్వటం గమనార్హం. అంతేకాక ఈ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాతో కలిపి ఇప్పటివరకు మొత్తం “11” మందిని అధికారులు అరెస్టు చేశారు. దీంతో.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో 11 నెంబర్‌కు ప్రత్యేక సంబంధం ఏర్పడింది.
ఇక కవితకు ఈడీ నోటీసులు, విచారణ నేపథ్యంలో.. సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కవితను విచారణ చేయడం మాత్రమే కాక అరెస్టు కూడా చేయొచ్చు.. చేసుకుంటే చేససుకోమ్మని.. తాము భయపడేది లేదంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇక నేటి విచారణతో ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.