Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీలో మరో దారుణం వెలుగు చూసింది. విద్యార్థులకు సుచిగా, శుభ్రంగా వండి, వండించాల్సిన సిబ్బందే.. వంటగదిలోనే స్నానాలు చేస్తూ పట్టుబడ్డారు. ఓ వైపు వంటలు చేస్తూ.. మరో వైపు స్నానాలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆ వంట సిబ్బంది వైఖరి సంచలనంగా మారింది. క్యాంపస్‌లోని పియూసీ 1, పియూసీ 2 విద్యార్థులు కేంద్రీయ భండార్ మెస్‌లో భోజనం వండిస్తారు. ఇక్కడ కిచెన్‌లో పని చేస్తున్న సిబ్బంది దారుణంగా వ్యవహరించి విస్మయానికి గురిచేశారు. విచ్చలవిడిగా వంటగదిలోనే స్నానాలు చేస్తున్నారు. వంట సిబ్బంది ఓ వైపు వంట చేస్తూ.. మరో వైపు స్నానాలు చేస్తున్న దృశ్యాలను ఎవరో వీడియో తీశారు. దాన్ని కాస్తా సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
ఆ వీడియో వైరల్‌గా మారింది. వంట సిబ్బంది తీరుపై అన్ని వర్గాలనుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. ఇక, బాసర ట్రిపుల్ ఐటీని వరుస వివాదాలు వెంటాడుతున్నా అధికారుల్లో ఎలాంటి మార్పు రావటం లేదని, సమస్యలపై ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ట్రిపుల్ ఐటీలో జరుగుతున్న దారుణాలపై విద్యార్ధులు ఆందోళనకు దిగుతున్నా అధికారులకు ఏమాత్రం పట్టడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : ధనవంతుల చెత్త బ్యాగు.. ఖరీదు తెలిస్తే నోరెళ్లబెడతారు!