Balenciaga Trash Bag: ఇంట్లో చెత్త పేరుకు పోయిందనుకోండి.. ఏం చేస్తాం? చెత్తనంతా ఓ ప్లాస్టిక్ కవర్లో కుక్కి, మూత కట్టి బయటపడేస్తాం. అందుకోసం సరుకులు కొన్నపుడు వచ్చిన కవర్లనో లేక చెత్త పాడేయటానికి కొన్న కవర్లనో ఉపయోగిస్తుంటారు చాలామంది. సాధారణంగా చెత్త పాడేయటానికి వాడే కవర్లు సైజును బట్టి ధర మారుతుంటుంది. ఇదంతా మిడిల్ క్లాస్, పేద వాళ్లకు సంబంధించిన విషయం. మరి ధనవంతుల సంగతేంటి?.. వారు కూడా మనలాగే చెత్త కవర్లు వాడతారా? అన్న సంశయం రావచ్చు. వాళ్లు ఎలాంటి కవర్లు వాడతారనే సంగతి పక్కన పెడితే.. కేవలం ధనవంతుల కోసమే ఓ కంపెనీ చెత్త వేసుకునే బ్యాగును తయారు చేసింది. అచ్చం మనం వాడే ప్లాస్టిక్ చెత్త బ్యాగులాగా ఉండే ఆ బ్యాగు ధర లక్షల్లో ఉంటుంది. బాలెన్సియాగా అనే కంపెనీ ఈ ఖరీదైన చెత్త బ్యాగులను తయారు చేస్తోంది. ఒక్కో బ్యాగు ధర అక్షరాలా 1.4 లక్షల రూపాయలు. లక్ష రూపాయలా.. అందులో అంత ప్రత్యేకత ఏముంది? అని మీరు అనుకోవచ్చు. ఆ చెత్త బ్యాగు ప్రత్యేకమైనదే.. దాన్ని జంతువుల చర్మంతో తయారు చేశారు. నలుపు, తెలుపు, నీలం, పసుపు రంగుల్లో అందుబాటులో ఉన్నాయి. తాజాగా, జరిగిన బాలెన్సియా వింటర్ 22 కలెక్షన్ ఫ్యాషన్ షోలో దీన్ని గురించి ప్రదర్శన ఇచ్చారు. ప్రస్తుతం ఈ చెత్త బ్యాగుపై సోషల్ మీడియాలో విపరీతమైన కామెంట్లు వస్తున్నాయి. మరి, ఈ ఖరీదైన చెత్త బ్యాగుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇవి కూడా చదవండి : Viral Video: యముడు లంచ్ బ్రేక్‌లో ఉన్నట్టున్నాడు..! పెను ప్రమాదం నుండి బయటపడ్డాడు!