తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అస్వస్థతకు గురయ్యారు. ఆయన జ్వరంతో బాధపడుతున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ముచ్చింతల్ లో శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ ఉత్సవాల్లో పాల్గొనడం కోసం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. మోదీని ఆహ్వానించేందుకు సీఎం కేసీఆర్ వెళ్లాల్సి ఉండగా.. అనుకోకుండా ఆయన అస్వస్థతకు గురవ్వడంతో మంత్రులు, గవర్నర్ తమిళ సై మోదీకి స్వాగతం పలకనున్నారు. ఇక్రిశాట్ కార్యక్రమానికి కూడా కేసీఆర్ హాజర కాకపోవచ్చని.. సాయంత్రం చినజీయర్ ఆశ్రమానికి వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం.