ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపధ్యంలో పల్లెలు, పట్టణాలను వరదలు ముంచెత్తాయి. గోదావరి అయితే మహోగ్ర రూపం దాల్చింది. దీంతో భద్రాచలం పరిహహాక ప్రాంతాలు అన్నీ జలమయం అయ్యాయి.
ప్రస్తుతం సీఎం కేసీఆర్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. అందులో భాగంగానే ఆయన ఓ ముఖ్య ప్రకటన విడుదల చేశాడు. ఆ వివరాల్లోకి వెళితే..
దానిలో భాగంగానే.. భద్రాచంలో పర్యటించి అక్కడి పరిస్థితుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే గోదావరికి శాంతి పూజలు సైతం కేసీఆర్ చేశారు. కేసీఆర్ మాట్లాడుతూ.. జూలై 29 వరకు ఇలాగే వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పినట్లు ఆయన తెలిపారు. ప్రమాదం ఇంకా తప్పలేదని, ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. క్యాంప్ లో ఉన్న వారిని ఇప్పుడే ఇళ్లకు పంపొద్దన్నారు. అలాగే ప్రతి కుటుంబానికి రూ.10 వేలు తక్షణ సాయంగా ఇస్తామని ప్రకటించారు. వారికి 2 నెలల పాటు 20కేజీల బియ్యం ఉచితంగా ఇస్తామని హామి ఇచ్చారు.
సీఎం కేసీఆర్ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేయాల్సి ఉంది. కానీ వాతావరణం సహకరించక పోవడంతో రోడ్డు మార్గం ద్వారానే ఆయన తన పర్యటన చేస్తున్నారు. మరి వరద ప్రభావిత బాధితులకు సహాయం ప్రకటించిన సీఎం కేసీఆర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Bhadrachalam: భద్రాచలం వరదల్లో కొత్త కష్టం! సామాను ఎత్తుకెళ్తున్న దొంగలు!