ప్రజారవాణా సామాన్య ప్రజలపై మరోసారి భారం మోపింది. గత కొన్నిరోజులుగా వరుసగా రేట్లు ఆర్టీసీ చార్జీల రేట్లు పెరగడం సామాన్యాలకు పెను భారంగా మారింది. రాష్ట్రంలో ఆర్టీసీ ఛార్జీలను మళ్లీ పెంచింది. పెరిగిన ఛార్జీలు తక్షణమే అమల్లోకి వస్తాయని టీఎస్ఆర్టీసీ వెల్లడించింది. ప్యాసింజర్ సెస్ పేరున ఈ చార్జీలు పెంచింది.
తెలంగాణ వ్యాప్తంగా తిరుగుతున్న బస్సుల్లో సాధారణ చార్జీలతో పాటు అదనంగా ప్యాసింజర్ సెస్ పేరున రూ.5-10 వరకు వసూలు చేయాలని నిర్ణయించింది. అంతేకాదు పెంచిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలంగాణ ఆర్టీసీ వెల్లడించింది. ఇటీవల బస్సు పాస్ ధరలను పెంచుతూ ఆర్టీసీ నిర్ణయం తీసుకన్న సంగతి తెలిసిందే. పెరిగిన ధరలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. మరోవైపు ఆర్టీసీ చార్జీలు పెంచడంపై ప్రయాణీకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.