కేఎంసీ మెడికల్ స్టూడెంట్ ప్రీతి మృతి ఘటన ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. అలాంటి ఈ ఘటనపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఈమేరకు ప్రీతి పేరెంట్స్‌కు కవిత ఓ లేఖ రాశారు. అందులో ఆమె ఏం రాసుకొచచ్చారంటే..!
వరంగల్ కాకతీయ వైద్య కళాశాల విద్యార్థిని ధరావత్ ప్రీతి ఆత్మహత్య ఉదంతం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. సీనియర్ విద్యార్థి వేధింపులు తట్టుకోలేక ఆమె సూసైడ్ చేసుకున్న విషయం విదితమే. ప్రీతి చనిపోవడానికి కారణమైన నిందితుడు సైఫ్‌ను కఠినంగా శిక్షించాలని సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ప్రీతి మరణవార్త విని తీవ్ర దిగ్ర్భాంతికి లోనయ్యాయనని ఆమె తెలిపారు. ఈ మేరకు ప్రీతి పేరెంట్స్‌కు ఆమె ఓ లేఖ రాశారు. ఏ తల్లిదండ్రులకూ రాకూడని పరిస్థితి ఇదని కవిత అన్నారు.
‘ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి పీజీ వైద్య విద్యను చదువుకుంటున్న ప్రీతికి ఇలా జరగడం జీర్ణించుకోలేకపోతున్నా. ఏ తల్లిదండ్రులకు కూడా రాకూడని పరిస్థితి ఇది. బాధిత కుటుంబానికి కేసీఆర్ సర్కారు, భారత రాష్ట్ర సమితి అండగా ఉంటుంది. విద్యార్థిని కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. ఆమె మృతికి కారకులైన వారిని సర్కారు వదిలిపెట్టబోదని హామీ ఇస్తున్నా. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది’ అని కవిత ఆ లెటర్లో స్పష్టం చేశారు. కాగా, కేయూసీలో అనస్థీషియా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ అయిన ప్రీతి ఈనెల 22న ప్రమాదకర ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారు. అపస్మార స్థితిలో ఉన్న ఆమెకు తొలుత వరంగల్ ఎంజీఎంలో, అనంతరం హైదరాబాద్‌లోని నిమ్స్‌లో ట్రీట్మెంట్ అందించారు. కానీ మృత్యువుతో పోరాడుతూ 26వ తేదీన తుదిశ్వాస విడిచారు ప్రీతి.
డాక్టర్ ప్రీతి తల్లితండ్రులకు నా లేఖ pic.twitter.com/SsIQimvQdP
— Kavitha Kalvakuntla (@RaoKavitha) February 28, 2023