రోడ్డు పక్కన సిగరెట్లు తాగుతున్న స్టూడెంట్స్‌కు అధికార పార్టీ ఎమ్మెల్యే కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
సిగరెట్లు తాగడం, ఆల్కహాల్ సేవించడం లాంటి దురలవాట్లకు యువత బానిసలు అవుతున్నారు. ఈమధ్య డ్రగ్స్ వినియోగం కూడా బాగా పెరిగిపోయింది. పంజాబ్ లాంటి ఉత్తరాది రాష్ట్రాలకే పరిమితమైన మత్తు మందులు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకూ వ్యాపించాయని వార్తల్లో చూస్తున్నాం. చెడు అలవాట్ల వల్ల జీవితాలను నాశనం చేసుకుంటున్న యూత్‌లో మార్పులు తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉంది. వారికి మంచి, చెడులు వివరించే వారి అవసరం ఎంతైనా ఉంది. ఇదిలాఉండగా.. తెలంగాణలో మరికొన్ని నెలల్లో ఎన్నికల నగారా మోగనుంది.
ఎలక్షన్ ఇయర్ కావడంతో ప్రజల్లో తిరుగుతూ బిజీబిజీగా గడుపుతున్నారు నేతలు. జనాల సాదకబాధకాలు తెలుసుకుంటూ అండగా నిలుస్తున్నారు నాయకులు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ తన నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ‘ప్రగతి యాత్ర’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించుకుని ప్రజల్లోకి వెళ్తున్నారు వివేకానంద్. ఇవ్వాళ ఉదయం ఆయన దూలపల్లిలో విజిట్ చేశారు. అక్కడో చోట కాలేజీ యువత సిగరెట్లు తాగుతూ ఎమ్మెల్యేకు కనిపించారు. దీంతో వారి వద్దకు వెళ్లారు వివేకానంద్. సిగరెట్లు తాగడం మంచిది కాందటూ విద్యార్థులకు ఆయన క్లాస్ పీకారు.
చదువుకునే సమయంలో సిగరెట్లు తాగడం మంచిది కాదని ఎమ్మెల్యే వివేకానంద్ చెప్పారు. స్మోకింగ్ చేస్తున్న స్టూడెంట్స్ వివరాలను అడిగి తెలుసుకున్న ఆయన.. ఎక్కడో గ్రామాల నుంచి చదువుకోవడానికి ఇక్కడకు వచ్చి, ఇలా చెడు అలవాట్ల బారిన పడటం సరైంది కాదని వారికి హితవు పలికారు. ఈ వ్యసనాలకు దూరంగా ఉంటే భవిష్యత్ బాగుంటుందని సూచించారు. కన్నవారి కలలను నిజం చేయాలన్నారు. ఇక మీదట స్మోకింగ్ చేయబోమని.. సిగరెట్లు తాగడం మానేస్తామని విద్యార్థులతో ప్రామిస్ చేయించారు. వారిని బాగా చదుకోవాలని చెప్పి, ఆల్ ది బెస్ట్ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. మరి.. విద్యార్థులతో స్మోకింగ్ బంద్ చేయించేందుకు ఎమ్మెల్యే వివేకానంద్ చేసిన ప్రయత్నంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
‘ప్రగతి యాత్ర‘లో భాగంగా దూలపల్లిలో పర్యటిస్తున్న క్రమంలో.. యువత సిగరెట్లు తాగుతూ కనిపించడంతో చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. pic.twitter.com/XjwTXon5Dz
— Vivekanand KP (@kp_vivekanand) March 27, 2023