భర్త మరణం తర్వాత అమృత ప్రణయ్ ఒంటరిగా జీవిస్తున్నారు. తన పాపలో భర్తను చూసుకుంటూ బతికేస్తున్నారు. అంతేకాదు! ఓ యూట్యూబ్ ఛానల్ పెట్టి అప్పుడప్పుడు వీడియోలు కూడా చేస్తున్నారు. ఆ వీడియోల్లో తనకు సంబంధించిన విషయాలను చెప్పుకొస్తున్నారు.
అమృత ప్రణయ్.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరిది. పరువు హత్యగా 2018 సమయంలో దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించింది. అమృత వేరే కులం వ్యక్తిని పెళ్లి చేసుకోవటంతో ఆమె తండ్రి, బాబాయ్ తట్టుకోలేకపోయారు. అమృత భర్త అయిన పెరుమాళ్ల ప్రణయ్‌ను చంపి కూతుర్ని ఇంటికి తీసుకురావాలని అనుకున్నారు. కూతురు కడుపుతో ఉందని చూడకుండా అల్లుడి మర్డర్‌కు ప్లాన్ వేశారు. అమృతకు చెకప్ చేయించటానికి ఆసుపత్రికి వెళ్లిన ప్రణయ్‌పై ఓ కాంట్రాక్ట్ కిల్లర్‌తో దాడి చేయించారు. ఈ దాడిలో ప్రణయ్ అక్కడికక్కడే మరణించాడు. తర్వాత చోటుచేసుకున్న పరిణామాలతో అమృత తండ్రి జైలు పాలయ్యారు.
బెయిల్‌పై విడుదలై బయటకు వచ్చిన ఆయన ఖైరతాబాద్‌లోని ఆర్యవైశ్య భవనంలో ఆత్మహత్య చేసుకుని మరణించారు. తండ్రి మరణం తర్వాత కూడా అమృత తన ఇంటికి వెళ్లలేదు. ఇంకో పెళ్లి చేసుకోలేదు. తన బిడ్డను చూసుకుంటూ జీవితం గడుపుతోంది. ఓ యూట్యూబ్ ఛానల్ పెట్టి వీడియోలు చేస్తోంది. అయితే, అమృత మళ్లీ పెళ్లి చేసుకోబోతోందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పెళ్లి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే, ఈ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని తేలింది. అమృతి రెడీ అవుతోంది తన పెళ్లి కోసం కాదని, తన బెస్ట్ ఫ్రెండ్ పెళ్లి కోసమని తెలియవచ్చింది.
మూడు రోజుల క్రితం ఆమె తన అఫిషియల్ యూట్యూబ్ ఖాతాలో ఓ వీడియోను విడుదల చేశారు. ‘‘ నా ఫ్రెండ్ ఎంగేజ్మెంట్కు నా హడావిడి’ అని రాసుకొచ్చింది. ఫ్రెండ్ పెళ్లి కోసం తాను ఎలా తయారు అవుతుందో ఆ వీడియోలో చెప్పుకొచ్చింది. 18 నిమిషాల నిడివి కలిగిన ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఆ వీడియోను పూర్తిగా చూడని, కింద ఆమె రాసిన దాన్ని పూర్తిగా చదవని వాళ్లు అమృత తన పెళ్లి కోసమే రెడీ అవుతోందని తమకు నచ్చింది ఊహించుకున్నారు. ఈ మేరకు తప్పుడు వార్తలను సోషల్ మీడియాలో ప్రచారం చేయటం మొదలుపెట్టారు.
ఇంతకు ముందు చాలా సార్లు అమృత మళ్లీ పెళ్లి చేసుకోబోతోందని అన్నారు. అయినా ఆ వార్తల్లో నిజం లేదని తేలింది. ఈ సారి కూడా అమృత రెండో వివాహం మీద వస్తున్న వార్తలు ఒట్టి అవాస్తవాలేనని తేలింది. కాగా, అమృత ప్రణయ్ 30 జనవరి 2019న, సరిగ్గా మొదటి వివాహ వార్షికోత్సవం సందర్భంగా నిహాన్ ప్రణయ్ అనే బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఆమె తన బిడ్డలో భర్త ప్రణయ్‌ని చూసుకుంటూ కాలం వెళ్లదీస్తోంది. మరి, అమృత ప్రణయ్ మళ్లీ పెళ్లి చేసుకోబోతోందని జరుగుతున్న ప్రచారంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.